మరియమాత పవిత్ర నామకరణ మహోత్సవం

జోసెఫ్ అవినాష్

12 Sep 2026

సృష్టి ఆరంభంలోనే ఎప్పుడైతే ఆది తల్లిదండ్రులు దేవుని మాటకు వ్యతిరేకంగా పాపము చేశారో అప్పుడే దేవుడు మరియతల్లిని రక్షణ ప్రణాళికలో భాగంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకే ‘‘నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును’’ (ఆ.కాం. 3:15) అని దేవుడు పలికాడు. రక్షణ ప్రణాళికలో ఆ మరియతల్లి పాత్ర లేకపోతే, అనాడు తండ్రి దేవుడు ‘నీకును స్త్రీకిని అనకుండా స్త్రీ సంతతికి, నీ సంతతికి’ అని పలికే వాడు కదా! దేవుడు ఆవిధంగా పలకడంలో పరమార్ధం రక్షణ ప్రణాళికలో మరియతల్లి సైతానుతో పోరాడుతుందని అర్ధం. అనగా మరియతల్లి ఎన్నిక అప్పుడే జరిగింది.

అందుకే, ఎన్నోసంవత్సరాలుగా బిడ్డలు లేక బాధపడుతున్న అన్నమ్మ, జ్వాకీములకు పవిత్రాత్మ వరము వలన జన్మించింది. బైబిల్ గ్రంధంలో దేవుడు కారణజన్ముల పుట్టుకను ముందుగానే ప్రవక్తల ద్వారా మానవాళికి తెలియపరిచారు. వాళ్ళు ఎప్పుడు పుడతారు? వారి పుట్టుక ఉద్దేశం? మరియు వారికి ఏ పేరు పెట్టాలో కూడా తండ్రి దేవుడు నిర్ణయించారు. ఉదా - క్రీస్తు జననం, బాప్తిస్మ యోహాను జననం, మరియమాత జననం. వీళ్ళకి పేర్లు దేవుడే పెట్టారు. మానవ మాత్రులైన మనకి కతోలిక గురువులు లేదా మన తల్లిదండ్రులు పేరు పెడతారు. కానీ సాక్షాత్తు లోక రక్షకుడైన క్రీస్తుకు జన్మనివ్వబోయే గొప్ప తల్లికి దేవుడే "మరియా" అని నామకరణం చేశారు. మరియ అనగా ఉత్తమమైనది, దేవుని అనుగ్రహాలతో పరిపూర్ణంగా నింపబడిన స్త్రీ అని, ఉదయకాల నక్షత్రం అనే అర్ధాలు వస్తాయి. ఈరోజు మరియమాత పవిత్ర నామకరణ మహోత్సవం. మనం కూడా ఆ తల్లి వలె మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ, దైవ బాటలో అడుగులు వేద్దాం. పండుగ శుభాకాంక్షలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN