బైబిలును ఎందుకు రెండు భాగాలుగా విభజించారు ?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
11 Sep 2026
బైబిలును రెండు భాగాలుగా విభజించారు.మొదటి భాగంలో 40 పుస్తకాలుంటాయి. దీనిని పూర్వ నిబంధన అన్నారు. రెండవ భాగంలో 27 పుస్తకాలుంటాయి. దానిని నూతన నిబంధన అన్నారు. పూర్వ నిబంధన లేక పాత నిబంధనలో,దేవునిచేత ఎన్నుకోబడిన ఇశ్రాయేలు ప్రజల చరిత్ర వివరించబడి ఉంది. వీరు ఎన్నుకోబడిన ప్రజలు కాబట్టి వీరి నుండి మెస్సయ ఉద్భవిస్తాడు. అందుకే ఈ పాత నిబంధన దైవ ప్రజల చరిత్ర.ఇందులో మెస్సయ గురించిన ప్రవక్తల సందేశాలుంటాయి.మానవ జీవితాలకి సంబంధించిన అనేక అంశాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇక నూతన నిబంధనలో, పాత నిబంధనలోని ప్రవచనాలు నెరవేరడం,వాటి నిరూపణ వివరించబడిఉంటుంది. అలాగే మనుష్యావతారుడైన దైవ కుమారుని జీవితం, సందేశం ఇందులో నిక్షిప్తంచేయబడింది. ఆ పవిత్రాత్మ ప్రేరణతో వివిధ భక్తులు వివిధ ఆ సంఘాలకు వ్రాసిన పత్రికలు, సందేశాలు ఇందులో ఉంటాయి. పాతనిబంధనలోని చివరి పుస్తకానికి,నూతన నిబంధనలోని మొదటి పుస్తకానికి మధ్య దాదాపు నాలుగు వందల సంవత్సరాల విరామం ఉంటుంది.అందువల్ల కూడా ఈ విభజన సమర్ధనీయమే!
