యువతకు అండగా నిలుద్దాం.. ప్రాణాలను కాపాడుదాం

జోసెఫ్ అవినాష్

11 Sep 2026

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జైపూర్ పీఠం ఆధ్వర్యంలోని కాథలిక్ మెంటల్ హెల్త్ మినిస్ట్రీ (CMHM) సెప్టెంబర్ 10న లాలర్‌పురాలోని సోఫియా సీనియర్ సెకండరీ పాఠశాలలో యువత కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.“ఆత్మహత్యపై మన ఆలోచనా విధానాన్ని మార్చుకుందాం” అనే ప్రపంచవ్యాప్త నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎదుర్కొనే విద్యాభారం,వేధింపులు,తోటి విద్యార్థుల ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలపై చర్చించారు.పాఠశాల కౌన్సిలర్ సప్నా ప్రతీక్,భావోద్వేగంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి,వారికి తోడుగా నిలిచి, అవసరమైన సహాయానికి అనుసంధానం చేసి,కలిసి ముందుకు సాగాలని సూచించారు. CMHM డయోసిసన్ కార్యదర్శి సిస్టర్ జోసితా అబ్రహాం ప్రతి మానవ ప్రాణానికి ఉన్న విలువ,గౌరవాన్ని గుర్తుచేస్తూ,యువత తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారి బాధలను కూడా గమనించాలని కోరారు.విద్యార్థులు పోస్టర్ తయారీ కార్యక్రమంలో పాల్గొని “మీ కథకు విలువ ఉంది”, “సహాయం కోరడం బలహీనత కాదు” వంటి ఆశాభావ సందేశాలను వ్యక్తం చేశారు. మానసికంగా బాధపడుతున్న వారు తమ సమస్యలను ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదని,సమయానికి సహాయం కోరడం ధైర్యానికి సంకేతమని కార్యక్రమం స్పష్టం చేసింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN