దివ్య సత్ప్రసాద అద్భుతాలు - మరుగుతున్న నూనెలో వేసిన పవిత్ర దివ్య సత్ప్రసాదం

సిస్టర్ యం.అంతోనమ్మ, msi
11 Sep 2026
దక్షిణ ఇటలీ దేశంలోని త్రాణి ఒక సముద్ర తీరపట్టణం.11వ శతాబ్దంలో త్రాణి చాలా ముఖ్యమైన పట్టణం.ఇచట మోక్షారోపిత మాత కథెడ్రల్ చాల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.ఎందుకనగా ఈ అసాధారణమైన దివ్య సత్ప్రసాద అద్భుతం 996 సం॥లకు ముందే జరిగింది.దివ్య సత్ప్రసాద అద్భుతాలు మాములుగా గురువులు, క్రైస్తవులతో ముడిపడి ఉండేవి.కాని ఇప్పుడు మనం తెలిసికోబోతున్న అద్భుతం ఒక అన్యురాలికి జరిగిన అసాధారణమైన అనుభవం.ఆమె పేరు విల్లియన్, అన్యురాలైన ఆమెకి దివ్య సత్ప్రసాదమన్నా క్రీస్తుప్రభువు అన్నా అసహ్యం,ఒక రకమైన కసి,నడిపూజలో అప్పం, ద్రాక్షరసం క్రీస్తు శరీర రక్తములుగా మారటం ఒక అపోహ లేక భ్రమ.ఇది యదార్ధం కాదు అసత్యం.కేవలం ఒక నమ్మకం మాత్రమే.కాబట్టి నేను దీనిని అసత్యమని నిరూపించాలని కంకణం కట్టుకుంది.ఇలాంటి అనుమానంతో సతమతమవుతున్న వారి కనులు తెరువబడ్డాయి.మంచి అనుభూతిని పొందగలిగాం.
అద్భుతం: ఒక రోజు ఆమె దేవాలయానికి వచ్చింది. దివ్యపూజలో పాల్గొంది. విశ్వాసిలా నటించింది.అందరిలాగా దివ్య సత్ప్రసాదం స్వీకరించింది.గబగబా తన చోటికి వెళ్ళింది.నోటి నుండి దివ్య సత్ప్రసాదాన్ని బయటకు తీసింది చేతి రుమాల్లో చుట్టింది.త్వరత్వరగా ఇంటికి వెళ్ళింది.ఎంత త్వరగా ప్రయోగం చేయాలా అని ఆతృతగా తన రుమాల్లో దాచి తెచ్చిన దివ్య సత్ప్రసాదాన్ని బయటకు తీసింది.మరుగుతున్న నూనెలో వేసింది.వెంటనే ఆశీర్వదించిన అప్పం అద్భుతరీతిలో క్రీస్తు శరీర రక్తాలుగా మారి,దివ్య సత్ప్రసాదం అన్ని వైపుల నుండి రక్తం కారటం మొదలు పెట్టింది.కాగుతున్న నూనె నుంచి చెదిరి నేల మీద పడింది.ఆ అన్యురాలి గృహం మొత్తం రక్తపు మడుగులో తడిచి ముద్దయింది.ఆమె భయంతో గజగజ వణికిపోతుంది. అంతేకాదు మరుగుతున్న నూనె నుంచి రక్తం ఆమె శరీరం అంతా ప్రోక్షింపబడింది.అది గమనించిన ఆమె భయాందోళనలతో మరింత బెదిరిపోయి సహాయం కోసం గట్టిగా అరవటం మొదలుపెట్టింది.ఆమె అరుపులు విన్న చుట్టుప్రక్కల వారంతా పెద్దసంఖ్యలో ఆ గృహానికి చేరుకున్నారు.ఆ సన్నివేశాన్ని చూసిన వారంతా నమ్మశక్యంకాని ఆశ్చర్యానికి గురయ్యారు.గొప్ప దేవా ఈ పరమరహస్యాన్ని ఈ విధంగా తెలియపరిచావా అన్యురాలితోపాటు మా విశ్వాసాన్ని బలపరిచినందుకు వందనాలు!! స్తుతి స్తోత్రాలు!!! అంటూ దేవుణ్ణి పొగడి కీర్తించారు.ఈ అద్భుత వార్తను స్థానిక అగ్ర పీఠాధిపతికి తెలియజేసారు.వారు దీనికి సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని,ఈ స్మారకాన్ని ట్రాంప్ కేథడ్రల్ దేవాలయంలో ప్రతిష్టింపవలసిందిగా ఆదేశించారు. అటు తరువాత ఈ స్మారకాన్ని పునీత ఆండ్రూ 1670వ సం||లో ఫెర్డినాండో యుజెల్లిగారు వారి ప్రముఖ రచనలలో ఇలా పేర్కొన్నారు.సెక్రెడ్ ఇటలీ కతోలిక విశ్వాసాన్ని అందున నడిపూజలో దివ్య సత్ప్రసాదం స్వయానా క్రీస్తుప్రభుని శరీర రక్తాలుగా మారతాయి అన్న రహస్యం అన్యురాలి ద్వారా ఛేదించబడింది" దీనిని బలపరుస్తూ పునీత పాద్రోపియోగారు ఇలా వర్ణించారు.త్రానికిది గొప్ప అదృష్టం.ఎందుకనగా యేసుక్రీస్తు రక్తంలో రెండుసార్లు కడగబడింది ఎంతటి భాగ్యం. అన్యురాలికి వందనాలు.ఆమె పగతో పంతం గట్టి నిజమా లేక బూటకమా అన్న విషయాన్ని ఈ విధంగా సత్యమని నిరూపించబడింది. క్రీస్తుప్రభువుకి మనవాళిపై గల ప్రగాఢమైన ప్రేమ,జాలి,కరుణ,క్షమను లోకానికి ఈ విధంగా తెలియజేయబడింది.1706లో అన్యురాలి గృహం దైవమందిరంగా మార్చబడింది. గడిచిన 10 శతాబ్దాలలో అనేక రకాల పరీక్షలు,పరిశోధనలు నిర్వహించి ఇది ప్రభుక్రీస్తు శరీర రక్తాలన్న సత్యం తెలిసికోగలిగారు.
