బైబిల్లోని బెత్సయిద నగరంపై వెలుగులోకి వచ్చిన పురావస్తు ఆధారాలు

జోసెఫ్ అవినాష్

10 Sep 2026

బైబిల్లో యేసుక్రీస్తు తన పరిచర్యలో అనేక అద్భుతాలు చేసిన ప్రదేశంగా ప్రస్తావించబడిన బెత్సయిద నగరానికి సంబంధించి పురావస్తు పరిశోధనల్లో ఆసక్తికరమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఎల్-అరాజ్ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాలలో రోమన్ కాలానికి చెందిన నాణేలు, మట్టి దీపాలు,ధాన్యాన్ని రుబ్బే రాళ్లు,భవనాలకు సంబంధించిన స్తంభ భాగాలు తదితర వస్తువులు బయటపడ్డాయి.ముఖ్యంగా క్రీ.శ. 70కు ముందు కాలానికి చెందిన యూదుల వినియోగ వస్తువులు అక్కడ లభించడం, ఆ ప్రాంతంలో యూదుల నివాసానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను అందిస్తోంది.రోమన్ కాలంలో బెత్సయిదను జూలియస్ అనే పేరుతో కూడా పిలిచినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.ఈ పురావస్తు కనుగోళ్లు సువార్తల్లో ప్రస్తావించబడిన బెత్సయిద నగరం,దాని చారిత్రక నేపథ్యం మరియు ఆ కాలం నాటి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి మరింత సహాయపడుతున్నాయి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN