ప్రజలతో కలిసి నడిచే కాపరులుగా పీఠాధిపతులు ఉండాలి - పోప్

జోసెఫ్ అవినాష్

10 Sep 2026

సెప్టెంబర్ 10న రోమ్‌లో కొత్తగా నియమితులైన పీఠాధిపతుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్న పీఠాధిపతులను పోప్ లియో XIV కలుసుకున్నారు.ఈ సందర్భంగా పీఠాధిపతులు ముందుగా యేసుక్రీస్తుతో తమ సంబంధాన్ని బలపరచుకొని,ప్రార్థన,దేవుని వాక్యం,దివ్య సత్ప్రసాదం ద్వారా క్రీస్తుతో సన్నిహితంగా జీవించాలని కోరారు.ప్రజల ఆనందాలు,బాధలు,ఆశలు,కష్టాలను తెలుసుకుంటూ వారితో కలిసి నడవాలని సూచించారు. గురువులు,కుటుంబాలు,యువత,పేదలు,బాధల్లో ఉన్నవారిని ప్రేమతో ఆలకిస్తూ,ప్రతి ఒక్కరికీ తమ హృదయంలో స్థానం కల్పించాలని పోప్ పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా,మానవాళికి దేవుని రక్షణ అవసరం ఎప్పటికీ ఉంటుందని గుర్తుచేస్తూ, విశ్వాసులు,అవిశ్వాసులు అనే తేడా లేకుండా అందరికీ సువార్తను ప్రేమతో ప్రకటించాలని ఆయన కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN