నేటి పునీతులు: పునీత పీటర్ క్లావెర్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
09 Sep 2026
పీటర్ క్లావెర్ గారు స్పెయిన్ దేశంలో కతాలోనియా పట్టణంకు దాపులోని వెర్డు అనే గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో క్రీ||శ|| 1581లో జన్మించారు. బాల్యంనుండికూడా మంచి లక్షణాల్ని ప్రదర్శించారు. తనను క్రీస్తు భగవానునికి అంకితం గావించుకున్నారు.వారు బార్సలోనా యూనివర్శిటీలో డిగ్రీ చదివి విశేష శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తమ 20వ ఏట తారాగోనా పట్టణంలోని ఏసుసభ నోవిషియేట్ లో అభ్యర్థిగా ప్రవేశం పొందారు. ఫిలాసఫీ (తత్వశాస్త్రం) చదువుకై స్పెయిన్ దాపులోని మజొర్కా దీవిలోని పాల్మా నగరంలోగల ఏసు సభ వారి కళాశాలలో చేరారు. అక్కడ ఉన్న బ్రదర్ ఆల్ఫోన్సస్ రోడ్రిగ్వెజ్ గారితో స్నేహం పెంచుకున్నారు. ఎందుకంటే వారు పవిత్ర జీవితం గడిపే ప్రసిద్ధ వ్యక్తిగా పేర్గాంచారు. తర్వాత వారు పునీతులయ్యారుకూడా వారి ద్వారా పీటర్ క్లావెర్ గారి పూర్తి జీవితమే మారిపోయింది. సేవ చేయుటకు తనను మధ్య అమెరికాకు పంపమని తమ పెద్దలకు విన్నవించుకున్నారు.
స్పెయిన్లోని బార్సలోనాలో థియోలజీ (వేదాంత శాస్త్రం) విద్యను పఠించి క్రీ||శ|| 1610 ఏప్రిల్ లో స్పెయినను వీడి మధ్య అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలోగల న్యూకార్ట జేనా పట్టణం చేరుకున్నారు. అక్కడ తానొక సాధారణ బ్రదరుగానే సేవలందింపదలచారు. కాని అక్కడ నీగ్రో ప్రజలకు సేవ చేస్తున్న ఏసుసభ గురువు అల్ఫోన్సో దె శాండో వాల్ గారి ప్రోద్బలంతో క్లావెర్ గారు సొంతా ఫేనగరంలోని ఒక ఏసుసభమఠంలో చేరి గురువిద్యను కొనసాగించారు. న్యూకార్టజేనా పట్టణంలో క్రీ||శ|| 1615లో పరిశుద్ధ గురుపట్ట మొందారు.
ఫాదర్ శాండోవాల్ గార్కి తోడుగా ఫాదర్ క్లావెర్ గారు తమ గురు సేవలు మొదలు పెట్టారు. కొలంబియాలోని న్యూ కార్టజేనా ఓడరేవు పట్టణంలో వేలాది నీగ్రో ప్రజలు బంగారం, వెండి గనుల్లో పనిచేసేవారు. వారు బానిస బ్రతుకులు వెళ్లబుచ్చేవారు. అప్పుడే ఫాదర్ క్లావెర్ గార్కి నీగ్రోల నిజ జీవితాలు వెల్లడైనాయి.పశువుల వ్యాపారుల్లాగానే ఆ రోజుల్లో బానిసల వ్యాపారులుండేవారు. వారు ఆఫ్రికాలోని
అంగోలా, కాంగో వంటి ప్రాంతాల్లో బీద నీగ్రోలను
తక్కువ వెలకు కొని వారిని అమెరికాలో ఎక్కువ
వెలకు బానిసలనుగా అమ్మేసేవారు. క్రీ॥శ॥
15వ శతాబ్దంలో కూడా ఈ వ్యాపారం జోరుగా
సాగింది. ఆఫ్రికానుండి ఈ నీగ్రో బానిసల్ని ఓడల్లో
తరలించేవారు. న్యూ కార్టజీనా ఓడరేవుకు
తరచు ఈ బానిస ఓడలు వస్తుండేవి. ఈ ఓడలు ఇక్కడుకు వచ్చినప్పుడెల్లా ఒక నల్లని అంగీ ధరించిన ఒక తల్ల గురువు కొన్నిప్టెటెలు, గంపలతో నిలబడి తమ బంధువులు వస్తున్నారన్నట్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఓడ ఆగిన వెంటనే ఆ గురువు అందులోకి చకచకా ఎక్కి నీగ్రో బానిస ప్రతి ఒక్కరికి బిస్కట్లు పండ్లు, చల్లని పానీయం స్నేహ పూర్వకంగా అందించి వారిని ప్రేమతో కౌగలించుకునేవారు. చాలీ చాలని అన్న పానీయాలతో, గొలుసులతో కట్టివేయబడి సుమారు మూడు మాసాలు సుముద్ర ప్రయాణం చేసి అలసి, చిక్కిశల్యమైన ఆ బానిసలకు ఈ గురువు పలకరింపులు అమృత జల్లుల్లా అన్పించేవి. ఓడ పైభాగాన ఉన్న వారందర్ని కలసిన మీదట ఓడ క్రింది భాగానికి వచ్చేవారు. అక్కడ శుచి శుభ్రత లేక రోగులతో దుర్గంధ భూయిష్టంగా ఉండేది. అయినా ఆ గురువు అక్కడకు కూడా వెళ్లి
తినుబండారాలిచ్చి చల్లని పానీయాలందించేవారు. ఎంతో ఆప్యాయతతో నిమురుతూ వారి పుండ్లు, గాయాలకు మందువేసి కట్లు కట్టేవారు. అక్కడి దుర్వాసనను భరింపలేక ఆ గురువుకు సహాయకులుగా వచ్చినవారు మెల్లగా జారుకునేవారు. కాని ఆ గురువు మాత్రం ప్రతి ఒక్క బానిసకు తన సేవలందించి సంతృప్తి చెందేవారు. నీగ్రౌభాష తమకు రాకపోయినా మానవతా సేవకు భాషతో పనిలేదని ఆ నల్ల అంగీ గురువుకు బాగా తెలుసు. వారే పూర్ణ మానవతామూర్తి ఫాదర్ పీటర్ క్లవెర్ గారు.
కొందరు నీగ్రోబానిసలు తిండిలేక, రోగాలు ముదిరి ఓడలోనే అచేతనంగా పడి ఉండేవారు. అట్టివార్ని ఆ గురువే తమ భుజాన వైచి రేవు దగ్గరలోనే బానిసలను ఉంచే పాకలవద్దకు మోసుకుపోయేవారు. సకల సపర్యలు చేసేవారు. వారిని కొనుక్కున్న యజమానులవద్దకు చేరకముందు
తాత్కాలికంగా బస ఉండే ఆ పాకల్లో ఆ గురువు వారికి వివిధ పటాలు చూపి సైగలతో క్రైస్తవ విశ్వాస సత్యాల్ని బోధించి వారిని క్రైస్తవ మతంలోకి ఆహ్వానించేవారు. వారు అంగీకరింపగానే ఒక పండుగగా వారికి
జ్ఞానస్నానం సాంగ్యం జరిపించేవారు. వారికొక
చక్కని సిలువ స్వరూపాన్ని కానుక చేసేవారు. ఇలా బానిసలకు బానిసగా క్రీస్తు ప్రేమ చూపరిగా
మూడు లక్షలమంది నీగ్రోలకు పైగానే రక్షణ
భాగ్యమందించారు. న్యూ కార్టజేనా, న్యూ గ్రెనడా, కొలంబియా ప్రాంతంలో పీటర్ క్లావెర్ తమ గురుత్వ సేవల్ని విజయ వంతంగా అందచేశారు.
ప్రతి సంవత్సరం ఫాదర్ పీటర్ క్లావెర్ తాము ఉంటున్న చుట్టుముట్టు ప్రాంతాల్లోని నీగ్రోవారు అందర్ని సందర్శించి వారి క్రైస్తవ జీవితాన్ని మెరుగు పరచేవారు. బహిరంగ సంతల్లో తరచు ప్రసంగించేవారు. స్పెయిన్ వారి దాడికి గురియై దీవులలో పట్టుబడిన ఆంగ్లేయులు, డచ్చి వారికి కూడ క్లావెర్ తమ దయగల సేవలు అందించారు. వారి ప్రబోధాలకు ఆకర్షితులైన అన్యులు, ఖైదీలు ఎందరో శ్రీనభలో చేరారు. క్లా వెర్ ఓవికగా ఆనువత్రులకు వెళ్లి రోగులను పరామర్శించుటయే కాక గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలలో అక్రమ జంటల పెళ్లిళ్లను ఆశీర్వదించి వారి పిల్లలకు జ్ఞానస్నానాలిచ్చేవారు. ఇలా 35సం||ల పాటు ప్రభు సేవ బానిసల సేవ, ప్రజల సేవ చేశారు.
క్రీ||శ|| 1650లో హవానానుండి న్యూ కార్టజీనా వరకు వ్యాపించిన ప్లేగు అంటువ్యాధి ఆ ప్రజలను అతలాకుతలంచేసింది.వయోభారంతో ఫాదర్ క్లావెర్ ఎటూ తిరగలేక వారికొరకు ప్రార్థించేవారు. తమ ఏసుసభగురువులందరూ ప్లేగువ్యాధి పీడితుల
పరిచర్యలో ఉండగా వృద్ధ క్లావెర్ గార్ని
చూసుకోవడానికి ఒక నీగ్రో సేవకుని నియమించారు. కాని అతడెప్పుడూ ఆ గురువును శ్రద్దగా పట్టించు కోలేదు. చీదరించుకోవడం అవమానించడమే కాక ఆ గురువుకై పంపబడిన భోజనం కూడ కొంత తస్కరించేవాడు. కాని ఫాదర్ క్లావెర్ ఈ విషయాన్ని బైటకు తెలియనీయలేదు. ఇలా నాలుగేళ్లు శ్రమననుభవించారు.
క్రీ||శ|| 1654 సెప్టెంబరులో క్లావెర్ గారు మంచాన పడగా పరిస్థితి విషమించింది. వారి మేలులు పొందిన ఎందరో నీగ్రోలు, క్రైస్తవ భక్తులు తరలివచ్చి వారి దేహాన్ని తాకి, ప్రార్థించి, దుఃఖించి తమ కృతజ్ఞత చూపుకున్నారు. చివరకు 1654 సెప్టెంబరు 8న అనగా కన్యమరియాంబ జన్మదిన వార్షికోత్సవం రోజున మంగళవారం ఉదయం రెండు గంటలకు
తనువు చాలించారు. న్యూ కార్టజీనా నగరమంతా దుఃఖ సాగరంలో మునిగింది. క్రీ|| శ|| 1896లో 13వ లియో (సింహరాయులు) పోపుగారు వారికి పునీత పట్టానొసంగారు.
