పరస్పర ప్రేమే క్రైస్తవ జీవితానికి పునాది: పోప్

జోసెఫ్ అవినాష్

07 Sep 2026

సెప్టెంబర్ 6, 2026న ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా పోప్ లియో XIV క్రైస్తవ జీవితంలో పరస్పర ప్రేమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖలోని “ఒకరినొకరు ప్రేమించుకోవడం తప్ప ఎవరికీ ఏమీ బాకీ ఉండకండి” అనే బోధను ప్రస్తావిస్తూ, ప్రేమ అనేది మనం ఎప్పటికీ తీర్చలేని రుణమని,అయితే అది మనలను బానిసలుగా చేయదని అన్నారు.నిజమైన క్రైస్తవ ప్రేమలో ఇతరుల తప్పులను వెనుక మాట్లాడటం లేదా విమర్శించడం కాకుండా,వారిని ప్రేమతో సరిదిద్దడం,వారి మాటలను వినడం, క్షమించడం ముఖ్యమని పోప్ చెప్పారు.అలాగే కలిసి ప్రార్థించడం ద్వారా మన మధ్య ఐక్యత,సోదరభావం మరింత బలపడతాయని తెలిపారు.నేటి ప్రపంచంలో ఇతరులను అపరిచితులుగా లేదా శత్రువులుగా చూసే పరిస్థితులకు బదులుగా,క్రీస్తు శిష్యులు పరస్పరం ప్రేమించుకుంటూ, ఒకరి బాధలను మరొకరు పంచుకుంటూ,దేవుని కృపతో సోదరసోదరీమణులుగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN