నేటి పునీతులు:పునీత క్లౌడు
.jpg)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
07 Sep 2026
క్లోవిస్ రాజు మరియు పునీత క్లిటిలా దంపతులకు మనుమడు ఈ పునీత క్లౌడుగారు.క్రీ||శ|| 524లో ఫ్రాన్సుదేశంలో జన్మించారు. రాజ్య కాంక్షవల్ల వారి పినతండ్రులైన చైల్డు బర్టు మరియు క్లోటరు అనువారలు కుట్రపన్ని తన ఇరువురు సోదరులను సంహరించారు. ఇట్టి ప్రాణాపాయ స్థితిలో పునీత క్లౌడుగారు ఫ్రాన్సు దక్షిణ ప్రాంతంకు పారిపోయి అజ్ఞాతవాసం చేశారు. దేవుని పై అమిత ప్రేమ భక్తి విశ్వాసాలు గలవారు ఎలాగైనా దైవ సేవలో క్రియాశీల పాత్ర నిర్వహించాలని, ఈ లోక రాజ్యమునకై వెంపరలాడక ఆథ్యాత్మిక రాజ్య పెందలకే తన జీవితం ధారపోయాలని నడుంకట్టారు. పిమ్మట ప్యారిస్ నగర దరిదాపుల్లోకి తిరిగివచ్చి పునీత సెవెరినుగారికి శిష్యుడుగా మారారు.
పునీత క్లౌడుగారు ఎంతో ఓపికతో విశ్వాసంతో ప్రజల్లో సువార్తా ప్రచారం చేసేవారు. వారి ఆపదలో తగు సలహాలనిచ్చి ప్రార్థనా సహాయంతో ఆదుకునేవారు. అనేకసార్లు క్రీస్తు పేరట అద్భుతాలుకూడ జరిగించేవారు. ప్రజల వత్తిడివల్ల వారు ఒకరోజున గురువుగా పట్టాభిషేకం స్వీకరించారు. మరికొంతకాలం వరకు ప్రభు సేవలోనే గడుపుతూ ప్యారిసు మహానగరంకు దగ్గరలోనేగల నోజెంట్ అను ఊల్లో ఒక సన్యాసి గురువుల ఆశ్రమాన్ని నెలకొల్పారు. కొందరు పరిశుదులైన అనుచరులతో కలసి ఆ మఠంలో మకాం పెట్టి ప్రార్థన, ఉపవాసం, దైవధ్యానంలో క్రొత్త జీవితం ఆరంభించారు. తామొక మఠాధిపతిగా అనుచర సన్యాసులకు మార్గదర్శకులయ్యారు. వారు తమ చిన్న ప్రాయంలోనే అనగా తమ 36వ ఏటనే క్రీ||శ|| 560లో పరలోక ప్రాప్తి చెందారు. తాము నిర్మంచి నివాసముంటున్న ఆశ్రమానికి వారి పేరట పునీత క్లౌడు మఠాలయంగా పిలువబడింది.
ఫ్రాన్సుదేశంలో క్లౌడు అనుమాటకు చీల లేక మేకు అని అర్థం . అట్టి పుణ్యాత్ముని మరువజాలని మేకులు తయారుచేయుటనే వృత్తిగా కలవారు పునీత క్లౌడు (చీలనాధుడు) గారిని తమ పాలక పునీతులనుగా ఏర్పరచుకొని ప్రత్యేక గౌరవం ప్రదర్శించారు. నోజెంటు పట్టణంకు మరియు ఆ పట్టణమున్న మిన్నెసోతా మేత్రాసనంకు వారు పాలక పునీతులుగా నియమింపబడినారు.
