దివ్యసత్ప్రసాద ఆరాధనతో శ్రీసభలో ప్రేమ,ఐక్యతను పెంపొందిద్దాం: పోప్

జోసెఫ్ అవినాష్

05 Sep 2026

పరిశుద్ధ దివ్యసత్ప్రసాద నాధున్ని నిరంతరం ఆరాధించే
సాక్రమెంటైన్ సభ కన్యాస్త్రీలను కలుసుకున్న పోప్ లియో XIV,దివ్యసత్ప్రసాద ఆరాధన దేవుని సన్నిధిని అనుభవించడానికి, క్రీస్తుతో మరింతగా ఏకమవడానికి, శ్రీసభలో ప్రేమ మరియు ఐక్యతను పెంపొందించడానికి గొప్ప మార్గమని అన్నారు.పరిశుద్ధ దివ్యసత్ప్రసాదములో క్రీస్తు నిజమైన సన్నిధిని ఆరాధిస్తూ ప్రార్థనలో గడిపే వారి జీవితం శ్రీసభకు ఎంతో విలువైన ఆధ్యాత్మిక సేవ అని ఆయన పేర్కొన్నారు. దివ్యసత్ప్రసాదం మనలను క్రీస్తుతో మాత్రమే కాకుండా పరస్పరం కూడా ఐక్యం చేస్తుందని,అందువల్ల ప్రేమలో శ్రీసభ ఐక్యతను నిర్మించే దివ్యసత్ప్రసాద ఆధ్యాత్మికత నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని పోప్ లియో XIV అన్నారు.ప్రార్థన,త్యాగం,సోదరభావం మరియు నిరంతర ఆరాధన ద్వారా క్రీస్తు ప్రేమను ప్రపంచానికి సాక్ష్యంగా చూపాలని ఆయన వారిని ప్రోత్సహించారు.పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో దేవుణ్ణి,పొరుగువారిని ప్రేమిస్తూ ఆశతో పవిత్రత వైపు ముందుకు సాగాలని పిలుపునిస్తూ పోప్ వారికి తన అపోస్తలిక ఆశీర్వాదాన్ని అందించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN