సెప్టెంబర్ 5, గురుదేవో భవ: టీచర్స్ డే

జోసెఫ్ అవినాష్

04 Sep 2026

"దేవుడు, గురువు ప్రక్కప్రక్కనే ఉంటె నేను మొదట గురువుకే నమస్కరిస్తా" అన్నారు మహానుభావుడు కబీరుదాస్. ఎందుకంటే, దేవుణ్ణి పరిచయ చేసింది గురువే కాబట్టి. సమాజంలో గురువుకున్న స్ధానం అంత గొప్పది మరి. అజ్ఞాన చీకట్లు తొలగించి గణనజ్యోతులను వెలిగించేవారు గురువులే. అంత గొప్ప గురువుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, వీరి సేవలను స్మరిస్తూ ప్రతి ఏటా సెప్టెంబరు ఐదో తేదీన జరుపుకొనే పండుగే 'ఉపాధ్యాయదినోత్సవం'. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉపాధ్యాయ వృత్తిలో తరించిన భారత మొదటి ఉప రాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, మహామహోపాధ్యాయ డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయులందరి జన్మదినంగా జరుపుకుంటున్నాం. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి అయన.
తల్లిదండ్రుల తర్వాతి స్ధానం గురువుదే. విద్యార్థిని ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దేవి విద్యాలయాలే. గురువృత్తి గురువుకు దైవత్వాన్ని ఆపాదించిపెట్టాయి. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది ఆర్యోక్తి. బాల్యం నుండే విద్యాబుద్ధులు నేర్పించి , మానవత్వాన్ని బోధించి, మంచి మనిషిగా తీర్చిదిద్ది భావితరానికి బహుమతిగా ప్రసాదించేది గురువే. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉండే సంబంధం ఎంతో పవిత్రమైనది. అందుకేనేమో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మరో వృత్తిలో మనలేరంటారు. నాగరిక ప్రపంచంలో గురు పాత్ర మసగబారుతున్నా, అఖండ గురువృత్తికి మరకలంటావు. గురువొక ఋషి. జీవన వికాస మార్గదర్శకుడు. సమాజమనే దేవాలయాయనికి సిసలైన పురోహితుడు. సమాజంలో అయన స్ధానం అత్యుత్తమమైనది.
కుటుంబంలో ఏ ఒక్కరు తప్పుచేసిన ఆ కుటుంబం మాత్రమే నష్టపోతోంది. కానీ ఉపాద్యాయుడు తప్పు చేస్తే సమాజమే నష్టపోతోంది. మారుతున్నా నాగరికత, పెరుగుతున్న సాంకేతికత తులసివనంలో గంజాయి మొక్కల్లా గురుశిష్యుల మధ్య సంబంధానికి బీటలు కొడుతున్నా గురుస్థానం పరమపవిత్రమైనది.
ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ వృత్తిని స్మరించుకుందాం. మన గురుదేవులందరికి శుభాకాంక్షలు తెలుపుకుందాం. ఉపాధ్యాయ వృత్తిని గౌరవిద్దాం. ఉపాధ్యాయులకు సహకరిద్దాం. మన పరమగురువు పరలోక ప్రభువు బోధించిన శుభవార్తను పంచుతున్న గురువులకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. సమాజానికి విద్యావిషయక ఆధ్యాత్మిక సౌందర్యాలను అద్దుతూ ప్రతి ఒక్కరు నీతినియమాలతో జీవిస్తూ మనకు దొరికిన మానవజన్మకు,అపారమైన తెలివితేటలకు దేవాదిదేవునికి వందనాలు చెల్లిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN