యేసుతో ఉండడం నేర్చుకోండి: గురు విద్యార్థులకు పోప్ పిలుపు

జోసెఫ్ అవినాష్

04 Sep 2026

సెప్టెంబర్ 3న ఇటలీలోని పియస్ XI ప్రాంతీయ గురు విద్యాలయ విద్యార్థులతో సమావేశమైన పోప్ వారితో ముచ్చటించారు.గురు విద్యార్థులు తమ శిక్షణలో అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తుతో సన్నిహితంగా ఉండడం నేర్చుకోవాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు. గురు విద్యార్థుల జీవితం కేవలం విద్యాభ్యాసం,క్రమశిక్షణ,గురుత్వ బాధ్యతలకు శిక్షణ పొందడం మాత్రమే కాదని,అది క్రీస్తుతో వ్యక్తిగతమైన మరియు లోతైన సంబంధాన్ని పెంపొందించుకునే కాలమని ఆయన వివరించారు.యేసు తన అపొస్తలులను ముందుగా తనతో ఉండేందుకు పిలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్ గురువులు కూడా ప్రార్థన,పవిత్ర గ్రంథ పఠనం, దివ్య సత్ప్రసాద ఆరాధన మరియు సోదరభావ జీవితం ద్వారా క్రీస్తుతో తమ బంధాన్ని బలపరచుకోవాలని సూచించారు. గురుత్వ పిలుపు మనిషి స్వయంగా సంపాదించుకునే గౌరవం కాదని,అది దేవుని ఉచితమైన వరం మరియు పిలుపు అని పోప్ అన్నారు.అందువల్ల గురు విద్యార్థులు తమ భవిష్యత్ పరిచర్యకు సిద్ధమవుతూ, ప్రజలకు సేవ చేయడానికి ముందుగా క్రీస్తుతో జీవించడం, ఆయన మాట వినడం, ఆయన ప్రేమలో నిలిచి ఉండడం నేర్చుకోవాలని ఆయన కోరారు.వారి జీవిత అర్పణ శ్రీసభకు ఆశకు,విశ్వాసానికి గొప్ప సంకేతమని పోప్ పేర్కొన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN