దేవుని దయ గొప్పది!

జోసెఫ్ అవినాష్

02 Sep 2026

సామాన్య 22వ గురువారం
సువిశేషం : లూకా 5:1-11
ధ్యానం:
యేసుప్రభువు సీమోను పడవ ఎక్కి ప్రజలకు బోధించడానికి ఒడ్డు నుండి కొంచెం దూరం వెళ్ళమని చెప్పి సీమోనును ఎలా ఆశ్చర్యపరిచాడో ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది.ఆ తర్వాత యేసు సీమోనును పడవను ఇంకను లోతుల్లోకి నెట్టమని,వారి వలలను చేపలు పట్టుటకై దించమని అడగడం ద్వారా వారిని మరొకసారి ఆశ్చర్యపరిచాడు.సీమోను మొదట అభ్యంతరం తెలిపినా యేసు ప్రభుని సన్నిధిలో ప్రేరణ పొంది,ఆయన మాట చొప్పున వలలను నీటిలోకి దించారు. ఇది విశ్వాస ప్రతిస్పందన, మనం కూడా ఇటువంటి ప్రతిస్పందనకై పిలువబడినాము.ప్రభువు తన శిష్యులందరినీ ప్రత్యేకించి ప్రభుని పరిచర్యలో భాగస్తులైన మనందరినీ ఇటువంటి ప్రతిస్పందనకై పిలుస్తున్నారు. సీమోను నమ్మకమైన విధేయత అద్భుతంగా చేపలను పట్టుకోవడానికి ప్రేరేపించింది. మనం దాతృత్వంతో ఆయన సేవ చేయుటకు వచ్చినప్పుడు, యేసుప్రభువు మనలో,మన ద్వారా గొప్ప కార్యాలను సాధిస్తారు.యేనుప్రభువు మనలో ప్రతి ఒక్కరి జీవితపు పడవలోకి ఆయనను స్వాగతించమని,ఆయనతో మళ్ళీ మన ప్రయాణాన్ని ప్రారంభించమని ఆహ్వానిస్తున్నారు.యేసు ప్రభునితో ప్రయాణం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. యేసుప్రభుని ఆహ్వానం మన ఉనికికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. మనం కూడా సీమోను పేతురు వలె, కొన్నిసార్లు ఈ పిలుపుకు ఆశ్చర్యపడినా,సంకోచించినా, యేసు మనలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు.మన బలహీనతలకై,మన వైఫల్యాలకై మనం నిరుత్సాహపడనవసరం లేదు. మన పాపాల కంటే దేవుని దయ గొప్పది! కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు!"

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN