పోప్ లియో XIVను కలిసిన భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య

జోసెఫ్ అవినాష్

01 Sep 2026

భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఆగస్టు 28న వాటికన్‌లో పోప్ లియో XIVను కలుసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో భారతదేశంలోని లాటిన్ కతోలిక శ్రీసభ జీవితం, సువార్త ప్రచారం మరియు భారత శ్రీసభ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. సమాఖ్య అధ్యక్షులు కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావో నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో బెంగళూరు అగ్ర పీఠాధిపతులు మహా ఘన .పీటర్ మచాడో, రాంచీ అగ్ర పీఠాధిపతులు మహా ఘన .విన్సెంట్ ఐండ్, ఫాదర్ డా. స్టీఫెన్ అలతారా పాల్గొన్నారు.ఈ సందర్భంగా భారతీయ కతోలిక సంప్రదాయానికి ప్రతీకగా వివిధ కానుకలను పోప్‌కు అందజేశారు. అలాగే సమాఖ్య రూపొందించిన “Journeying Towards a Synodal Church: Mission 2033” పాస్టరల్ ప్రణాళిక, భువనేశ్వర్ పత్రం మరియు సమాఖ్య ఆమోదించిన కతోలిక బైబిల్‌ను కూడా పోప్‌కు అందించారు.భారత శ్రీసభ రూపొందించిన పాస్టరల్ ప్రణాళికను పోప్ లియో XIV ప్రశంసించినట్లు కార్డినల్ ఫెర్రావో తెలిపారు. అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య భారతదేశంలోని 132 పీఠాలు, 217 మంది పీఠాధిపతులు, 564 మఠసభలు
మరియు దాదాపు 1.8 కోట్ల లాటిన్ కతోలిక విశ్వాసులకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN