సెప్టెంబర్ నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
01 Sep 2026
సెప్టెంబర్ 2026 నెలకు పోప్ లియో XIV “నీటి సంరక్షణ కోసం” ప్రార్థనా ఉద్దేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరికీ సమానంగా నీరు అందుబాటులో ఉండేలా,ఈ అమూల్యమైన సహజ వనరును న్యాయంగా,సుస్థిరంగా నిర్వహించేందుకు ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు.నీరు మానవ జీవితానికి మాత్రమే కాకుండా సమస్త సృష్టికి ఆధారం; అయితే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛమైన, సురక్షితమైన నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అందువల్ల నీటిని వృథా చేయకుండా, కాలుష్యం చేయకుండా సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోప్ గుర్తుచేశారు.నీటిని అందరికీ దేవుడు ప్రసాదించిన వరంగా భావిస్తూ,పేదలు మరియు నీటి కొరతతో బాధపడుతున్న ప్రజల పట్ల మన సంఘీభావాన్ని కార్యరూపంలో చూపాలని ఆయన కోరారు.నీటి పట్ల మన శ్రద్ధ సృష్టి పట్ల ప్రేమకు,దేవుని పట్ల కృతజ్ఞతకు,మన సహోదర సహోదరీల పట్ల బాధ్యతకు ప్రతిబింబంగా ఉండాలని పోప్ తెలిపారు.
