నేపాల్ వరద బాధితుల కోసం భారత కతోలిక పీఠాధిపతుల ప్రార్థనలు

జోసెఫ్ అవినాష్

31 Aug 2026

నేపాల్‌లో సంభవించిన ఘోరమైన హిమ సరస్సు అకస్మాత్తు ఉప్పొంగి వచ్చిన వరద కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి,గాయపడినవారికి,గల్లంతైనవారికి, నిరాశ్రయులైన కుటుంబాలకు భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య సంఘీభావం ప్రకటించింది. సమాఖ్య అధ్యక్షులు హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు కార్డినల్ మహా ఘన పూల ఆంతోని తండ్రి గారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ,బాధితుల కోసం కతోలిక సంఘం ప్రార్థనలు మరియు సహాయానికి సిద్ధంగా ఉందని తెలిపారు.గల్లంతైనవారు సురక్షితంగా బయటపడాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని,సహాయక చర్యలు విజయవంతం కావాలని ఆయన ప్రార్థించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN