రైల్వే స్టేషన్‌లో వదిలివేయబడిన ఐదేళ్ల బాలుడు నేడు కతోలిక గురువు
.jpg)
జోసెఫ్ అవినాష్
29 Aug 2026
28 ఏళ్ల క్రితం షొర్నూర్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల వయసులో అనాథగా వదిలివేయబడిన అణ్ణామలై అనే బాలుడు, నేడు ఫా. వివేక్ మార్టిన్గా మారి కతోలిక గురువుగా అభిషేకం పొందారు.తల్లిదండ్రుల ప్రేమను కూడా గుర్తుపట్టలేని ఆ బాలుడికి జీసస్ యూత్ సభ్యుడైన రెక్సీ డిక్రూజ్ మరియు ఆయన స్నేహితులు చట్టబద్ధమైన అనుమతులతో ఆశ్రయం కల్పించి, తమ పిల్లలతో పాటు అతడిని కూడా ప్రేమగా పెంచారు.అట్టప్పాడి నుంచి కొచ్చి వరకు సాగిన అతని బాల్యం విద్యతో పాటు సేవాభావంతో నిండింది.పదో తరగతిలో పాఠశాల నాయకుడిగా ఉన్న వివేక్,తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలనే కోరికను వ్యక్తం చేసి, ఇంటర్మీడియట్ అనంతరం ఝాన్సీ డయాసిస్ సెమినరీలో చేరారు.సెమినరీలో చేరే ముందు ఆలువాలో హెచ్‌ఐవీ బాధితుల కోసం పనిచేసే స్నేహతీరం సంస్థలో అంబులెన్స్ డ్రైవర్‌గా,సేవకుడిగా పనిచేసి కరుణను ఆచరణలో నేర్చుకున్నారు.ఆగస్టు 16, 2026న ఝాన్సీ బిషప్ విల్ఫ్రెడ్ మోరస్ చేతుల మీదుగా గురువుగా అభిషేకం పొందిన ఫా. వివేక్, ఆగస్టు 24న తుండత్తుకడవు దివ్య బాలయేసు పుణ్యక్షేత్రంలో తన తొలి దివ్యబలిపూజను అర్పించారు.
