నేపాల్ వరద బాధితులకు పోప్ లియో XIV సహాయం

జోసెఫ్ అవినాష్

29 Aug 2026

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఘోర వరదలు,ఆకస్మిక వరదల కారణంగా భారీగా ప్రాణనష్టం,ఆస్తినష్టం జరిగిన నేపథ్యంలో పోప్ లియో XIV బాధితుల పట్ల తన సానుభూతిని కార్యరూపంలో చూపించారు.బాధిత కుటుంబాలకు తన సమీపతను వ్యక్తం చేస్తూ, అత్యవసర సహాయం అందించేందుకు వాటికన్‌లోని చారిటీ సేవకు సంబంధించిన దాతృత్వ సేవ విభాగం ద్వారా నేపాల్‌లోని కారితాస్ సంస్థకు ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ సహాయం ద్వారా వరద బాధితులకు ఆహారం,ఆశ్రయం, ప్రాథమిక అవసరాలు వంటి అత్యవసర సహాయాన్ని అందించనున్నారు.ఈ చర్య ద్వారా ప్రకృతి విపత్తులతో బాధపడుతున్న ప్రజల పట్ల కతోలిక సంఘం తన సోదరభావాన్ని, క్రైస్తవ కరుణను మరోసారి వ్యక్తం చేసింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN