దాతృత్వం విశ్వాసాన్ని కాపాడుతుంది

జోసెఫ్ అవినాష్

27 Aug 2026

సామాన్య 21వ శుక్రవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 25:1-13
ఈనాటి సువార్త పఠనము (మత్తయి 25:1-13) మన స్వర్గ రాజ్య ప్రవేశ సిద్ధపాటుని విశదీకరిస్తుంది.10 మంది కన్యల ఉపమానం ద్వారా యేసుప్రభువు మనకు బోధించాలనుకొనదేమనగా, దేవుని ఎదుర్కొనుటకు మనం ఎల్లవేళలా సిద్దంగా ఉండమని, ఎందుకంటే "ఆ రోజును, ఆ గడియయును" (వ.13) మనకు తెలియదు.చాలాసార్లు సువార్తలో యేసుప్రభువు మెలకువగా ఉండమని ఉద్బోధించారు.మెలకువగా ఉండటం అంటే నిద్ర పోకుండా ఉండటం కాదు.పెళ్లికొడుకు రాకముందు కన్యకలందరూ నిద్రపోతున్నారు.కానీ మేల్కొన్న తర్వాత కొందరు సిద్ధంగా ఉన్నారు,ఇతరులు లేరు.కాబట్టి మెలకువగా ఉండటం అంటే వివేకంతో సిద్ధంగా ఉండమని అర్థం. దేవుని ప్రణాళికలో సహకరించడానికి మన జీవితంలో చివరి నిమిషం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు,కానీ ఇదే మన చివరి రోజులా ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి.ఎందుకంటే దేవుడు ఏ క్షణంలోనైనా మనలను పిలవవచ్చును, మనము సిద్ధంగా ఉన్నచో మరణపు నిద్ర కూడా మనల్ని భయపెట్టదు,మనము ప్రతిరోజు చేసే విశ్వాస క్రియల వలన మన జీవిత పాత్రలలో నూనెను నిల్వ చేసుకుందాం. విశ్వాసం దాతృత్వాన్ని ప్రేరేపిస్తుంది. దాతృత్వం విశ్వాసాన్ని కాపాడుతుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN