నేపాల్ ప్రకృతి విపత్తుపై పోప్ లియో XIV సంతాపం

జోసెఫ్ అవినాష్
27 Aug 2026
ఆగస్టు 27,2026న నేపాల్‌లో హిమపాతం,ఆకస్మిక వరదల కారణంగా సంభవించిన ప్రాణనష్టం,విధ్వంసంపై పోప్ లియో XIV తీవ్ర విచారం వ్యక్తం చేసి సంతాపం తెలిపారు.ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మల కోసం ప్రార్థించిన పోప్,బాధిత కుటుంబాలకు తన ఆధ్యాత్మిక సమీపాన్ని తెలియజేశారు.అలాగే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్న సైనికులు,రక్షణ సిబ్బందిని ప్రత్యేకంగా స్మరించారు.హిమాలయ ప్రాంతంలో మంచుకొండ భాగం అకస్మాత్తుగా కూలిపోవడంతో చైనా–నేపాల్ సరిహద్దు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చి గ్రామాలు, రహదారులు,వంతెనలు,విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. నేపాల్ సైన్యం, పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.ఈ విపత్తు బాధితులకు భారత్‌తో పాటు పొరుగు దేశాలు,ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలు అత్యవసర సహాయాన్ని అందించడం ప్రారంభించాయి.
