మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా కుటుంబాలు, శ్రీసభ కలిసి పనిచేయాలి - పోప్

జోసెఫ్ అవినాష్

27 Aug 2026

2026 ఆగస్టు 27న, లాటిన్ అమెరికా కోసం పోంటిఫికల్ కమిషన్ నిర్వహించిన “లాటిన్ అమెరికాలో మాదకద్రవ్యాల వ్యసనం – విముక్తి, పునరావాసం వైపు ప్రయాణం” అనే సమావేశంలో పోప్ లియో XIV పాల్గొన్నారు.మాదకద్రవ్యాల వ్యసనం వల్ల బాధపడుతున్న వ్యక్తులను,కుటుంబాలను తిరస్కరించకుండా వారికి చికిత్స,పునరావాసం,ఆధ్యాత్మిక మరియు సామాజిక సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.కుటుంబం ఈ సమస్యను ఎదుర్కోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్న పోప్,మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా కుటుంబాలను,సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు.శాస్త్రవేత్తలు,వైద్యులు,సామాజిక సంస్థలు,శ్రీసభ కలిసి పనిచేసి బాధితులకు గౌరవంతో కూడిన సహాయం అందించాలని సూచించారు.బాధలో ఉన్న ప్రతి వ్యక్తిలో క్రీస్తు ముఖాన్ని గుర్తించి,వారిని ప్రేమతో స్వీకరించే ఆశ్రయంగా,గాయాలను మాన్పే శ్రీసభగా కతోలిక సంఘం నిలవాలని పోప్ లియో XIV కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN