పునీత మోనికమ్మ పండుగ శుభాకాంక్షలతో

యలమంచిలి రాజ్యలక్ష్మి

26 Aug 2026

పునీత మోనికమ్మ
ఆదర్శం అందరికీ
ఆమె శ్రీసభకే ఒక కలికితురాయి
మరియమాత సహనం
రూతులా విశ్వాసం
ఎస్తేరులా ప్రార్థన
ఆమెకే సొంతం...

కన్నీటి ప్రార్ధనే అస్త్రం
ఆమె కన్నీటి వరదలో
కొట్టుకు వచ్చానన్న కొమరుని
మాటలు అబ్బుర పరచును
అందరినీ తల్లి ఓర్పు-
తనయుని మార్పు శ్రీసభకే మణిమకుటం
తల్లులకు మార్గదర్శి
తనయులకు మంచి స్ఫూర్తి
నిజాయితీకి నిండైన దర్పణం
ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం
స్వచ్ఛమైన భక్తికి తార్కాణం
కష్టాలకు వెరువని మనస్తత్వం
సహనానికి ప్రతీక
ఓర్పుకు మాతృక
స్ఫూర్తికి ప్రేరణ
వెరసి పునీత మోనిక...

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN