దైవార్చనలో చురుకైన భాగస్వామ్యం దేవునితో సజీవ సంబంధానికి దారితీస్తుంది: పోప్
జోసెఫ్ అవినాష్
26 Aug 2026
ఆగస్టు 26న సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన బుధవారం సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో XIV, రెండవ వాటికన్ మహాసభ దైవార్చన సంస్కరణకు ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు.దైవార్చనలో విశ్వాసులు మరింత చురుకుగా పాల్గొనడం ద్వారా దేవునితో మరింత లోతైన సంబంధంలోకి ప్రవేశించగలరని పోప్ అన్నారు.శ్రీసభ నిర్వహించే పవిత్ర సంస్కారాల ద్వారా క్రీస్తు రక్షణ కార్యాన్ని స్మరించుకోవడమే కాకుండా,ఆ రక్షణ కార్యంతో ప్రత్యక్షంగా సంబంధం ఏర్పరచుకునే అవకాశం విశ్వాసులకు లభిస్తుందని ఆయన తెలిపారు.దైవార్చనలోని మాటలు,సంజ్ఞలు ఈ అనుభవానికి ఎంతో ముఖ్యమైనవైనందున,విశ్వాసుల భాగస్వామ్యం నిష్క్రియాత్మకంగా ఉండకూడదని స్పష్టం చేశారు.దైవార్చన శ్రీసభ సమాజం మొత్తం కలిసి జరుపుకునే పవిత్ర వేడుక అని,అది క్రీస్తుతో మరియు పరస్పరం మరింత లోతైన ఐక్యతకు విశ్వాసులను నడిపించాలని పోప్ లియో XIV పేర్కొన్నారు.
