ప్రార్థనా జీవితం క్రైస్తవ విశ్వాసానికి హృదయం - పోప్
జోసెఫ్ అవినాష్
25 Aug 2026
ఇటలీలో జరుగుతున్న 76వ జాతీయ ప్రార్థనా వారోత్సవం సందర్భంగా పోప్ లియో XIV తన సందేశంలో ప్రార్థనా జీవితం క్రైస్తవ విశ్వాసానికి హృదయమని గుర్తుచేశారు.ప్రార్థన అనేది కేవలం కొన్ని ప్రార్థనా పదాలను పలకడం మాత్రమే కాదని, అది క్రీస్తుతో మన సంబంధాన్ని మరింత లోతుగా చేసి,మన జీవితాలను మార్చే ఆధ్యాత్మిక ప్రయాణమని ఆయన వివరించారు.ప్రారంభ క్రైస్తవులు అపొస్తలుల బోధనలో, సహవాసంలో,రొట్టె విరిచే ఆచరణలో మరియు ప్రార్థనలో ఏకమై జీవించిన విధానాన్ని నేటి క్రైస్తవులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.పవిత్ర గ్రంథం, జపమాల ధాన్యం మరియు సప్త సంస్కారాల ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ విశ్వాసంలో ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.ముఖ్యంగా క్రైస్తవ దీక్షను కేవలం సంస్కారాలను స్వీకరించేందుకు చేసే సిద్ధతగా కాకుండా,క్రీస్తుతో సన్నిహిత సంబంధంలోకి నడిపించే నిరంతర ఆధ్యాత్మిక మార్గంగా చూడాలని పోప్ అన్నారు.ప్రార్థనలో బలపడిన సంఘం ఇతరులను ఆహ్వానించే సంఘంగా మారి,తన జీవిత సాక్ష్యం ద్వారా క్రీస్తు ప్రేమను ప్రపంచానికి అందించాలని,తద్వారా సమాజంలో మంచితనం,సయోధ్య మరియు శాంతి విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
