ప్రతి మనిషి ముఖంలో క్రీస్తును దర్శించండి - పోప్

జోసెఫ్ అవినాష్

25 Aug 2026

2026 ఆగస్టు 24న సోమవారం,పోప్ లియో XIV స్పెయిన్‌కు చెందిన మేధో వైకల్యాలు,సెరిబ్రల్ పాల్సీ ఉన్నవారికి సేవలందించే మార్సోడెటో ఫెడరేషన్ సభ్యులను వాటికన్‌లో కలుసుకున్నారు.ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తులకు సేవ చేయడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాదని,ప్రతి వ్యక్తి ముఖంలో క్రీస్తు సాన్నిధ్యాన్ని గుర్తించే క్రైస్తవ సేవ అని పోప్ అన్నారు.ఇతరులకు కనిపించని ఎన్నో త్యాగాలతో ఈ సేవ కొనసాగుతుందని గుర్తుచేస్తూ,బలహీనులు, అణగారినవారు,ప్రత్యేక అవసరాలు ఉన్నవారిని సమాజం నుంచి దూరం చేయకుండా వారికి గౌరవం, ప్రేమ, ఆత్మీయత అందించాలని పిలుపునిచ్చారు.“ఈ నా అతి చిన్న సహోదరుల్లో ఒకరికి మీరు చేసినది నాకు చేసినట్టే” అనే యేసు బోధను గుర్తుచేస్తూ,అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తికి చేసే సేవను క్రీస్తుకే చేసే సేవగా చూడాలని చెప్పారు.ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడుతూ,ఎవరినీ పక్కన పెట్టకుండా అందరినీ సమాజంలో భాగస్వాములను చేయడమే నిజమైన క్రైస్తవ ప్రేమకు గుర్తు అని పోప్ స్పష్టం చేశారు.చివరగా వారి సేవలను మరియతల్లి రక్షణకు అప్పగిస్తూ,ప్రభువుపై విశ్వాసంతో తమ సేవను కొనసాగించాలని ఆశీర్వదించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN