ఆ ప్రభు బిడ్డలుగా మనం జీవిద్దాం

Admin
24 Aug 2026
సామాన్య 21వ మంగళవారం
1తెస్స 2:9-13
కీర్తన 139:7-12
మత్తయి 23:27-32
ధ్యానం:
ఎన్నడూ మారనివాడే మూర్ఖుడు.మనలో ఎంతోమంది మన తప్పులన్నీ ఇతరులపై మోపి కపటంతో నీతిమంతులుగా చలామణి కావడం లేదా? కపటం తీవ్రమైన దుర్గుణం.యేసు ఏ బలహీనతనైనా సహించాడు కాని కపటత్వాన్ని ఖడ్గాలవంటి మాటలతో ఖండించాడు. కుళ్ళు కుట్రలతో మేడిపండు మేలిమితో నీతి మంతులుగా చలామణి అగుచూ జీవిస్తున్నట్లయితే కపటత్వాన్ని వదలి మారు మనస్సు పొందాలి.
"మన పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తిచేయుడు (మత్తయి 23:32) నేడు మన నాయకులు ఏ కార్యక్రమం చేపట్టినా లంచగొండితనం కమీషన్ తీసుకొని చేపట్టిన పనిని పూర్తి చేయక పని పూర్తి చేయుటకు డబ్బులు సరిపోలేదు అని అబద్దాలు చెపుతూ వుంటారు. కాని నేటి సువార్తలో ప్రభు అలాంటి నాయకులను హెచ్చరించుచున్నాడు.పూర్వం నాయకులు స్వచ్ఛందంగా కష్టించి పనిచేసి మంచి పేరును సంపాదించుకొన్నారు. "పని చేయనివాడు భోజనమునకు అనర్హుడు" అని పౌలుగారు తెలియజేస్తున్నాడు.యేసు మంచిని పంచినా,మమతను చూపినా పరిసయ్యుల మనసు మారలేదు.అందుకే యేసు వారి కపటత్వాన్ని సమ్మెట దెబ్బలాంటి మాటలతో ఖండించాడు. ప్రభుయేసు మనకు ఆదర్శం,ఆ ప్రభు బిడ్డలుగా మనం జీవిద్దాం. ప్రభు దీవెనలు పొందుదాం.
