క్రీస్తుకు మన హృదయాలను తెరవాలి - పోప్
వాటికన్ వార్తా విభాగం
24 Aug 2026
ఆగస్టు 23న సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా పోప్ లియో XIV, సువిశేష సందేశాన్ని పంచుకున్నారు.యేసుక్రీస్తుతో ప్రతి విశ్వాసి సజీవమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.క్రైస్తవ విశ్వాసం కేవలం సంప్రదాయంగా అందుకున్న నమ్మకాలను అనుసరించడం మాత్రమే కాదని, యేసును నిజంగా తెలుసుకొని,ఆయనతో స్నేహంలో ఎదగడమే విశ్వాసానికి హృదయమని ఆయన అన్నారు. “నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని యేసు తన శిష్యులను అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ,అదే ప్రశ్నను మనం కూడా మన జీవితాల్లో వేసుకోవాలని సూచించారు.ప్రార్థన, సువార్త ధ్యానం,ఇతరులకు సేవ చేయడం ద్వారా క్రీస్తును మరింత లోతుగా తెలుసుకోవాలని,ఆయన బోధలు మన నిర్ణయాలను,జీవన విధానాన్ని మార్చేలా అనుమతించాలని పోప్ కోరారు.ముఖ్యంగా బాధల్లో ఉన్నవారిని,అవసరాల్లో ఉన్న సోదరసోదరీమణులను కలిసినప్పుడు క్రీస్తు మనకు మరింత ప్రత్యక్షమవుతాడని ఆయన చెప్పారు.అందువల్ల యేసు మనకు కేవలం చరిత్రలోని ఒక గొప్ప వ్యక్తి మాత్రమే కాకుండా,మన జీవితాలను మార్చి తండ్రి ప్రేమలోకి నడిపించే దేవుని క్రీస్తుగా ఉండాలని పోప్ లియో XIV పిలుపునిచ్చారు.
