పారిపోవనట్టి పటిమ సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 Aug 2026
సూక్తులు(జ్ఞాన గ్రంథము)
.............................................................
తెగువ చూపుటన్న ఎదిరించటము కాదు!
ఏటికి యెదురీదు పెళుసు గాదు!
సాహసమ్ము వలయు సద్విషయము నందు
పారిపోవనట్టి పటిమ సుమ్ము!.
