ప్రభుని పోలిన నాయకత్వం మనకు అవసరం

Admin
20 Aug 2026
సామాన్య 20వ శుక్రవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 22:34-40
అధికారంగలవారు వ్యక్తిగతంగాను, సమిష్టిగాను, వ్యవస్థపరంగాను అందరికి ఆమోదయోగ్యమైన నియమ నిబంధనలలో ప్రజా సంక్షేమంకోసం పాటుపడినపుడు వారు. నిజమైన నాయకులు అధికారులు.ఎంతోమంది నాయకుల త్యాగ ఫలమే మనము ఇప్పుడు స్వేచ్ఛగా జీవించుచున్నాము.కాని ఈనాటి నాయకులు స్వార్థబుద్ధితో జీవించేవారు ఎక్కువగా ఉన్నారు. నిజాయితీగా పరిపాలనను అందించేవారు బహుకొలది మంది మాత్రమే.ఇలాంటి నాయకులు క్రీస్తు కాలంలోకూడా వున్నారు. అందుకే యేసు వారిని మత్తయి (23:27)లో హెచ్చరించుచున్నారు. నేటి నాయకులు, బోధకులు కూడా ఈ విధంగా ఉన్నారు అనుటలో సందేహం లేదు.క్రీస్తుకాలం నాటి పరిస్థితులను అధ్యయనం చేస్తే కంచె చేను మేసిన విధంగా వుండేది. పాలకులు ప్రజలను దోచుకుతినేవారు.శాసనాలను చూపుతూ పేదవారి పొట్టను కొట్టేవారు.మరి ఈనాడు మన సంఘాలు,మన నాయకులు ఎలా వున్నారు? హోదాలోవున్న వారు తమ బాధ్యతలను విస్తరిస్తున్నారు. ఇటువంటి నాయకత్వం తగదని క్రీస్తుప్రభువు మనకు బోధిస్తున్నారు.నిజమైన గొర్రెల కోసం తన మంద కొరకు తన ప్రాణం ధారపోసే ప్రభుని పోలిన నాయకత్వం మనకు అవసరం.
