టాక్సీ డ్రైవర్లకు అండగా కార్మెలైట్ సిస్టర్స్

Matters india

20 Aug 2026

కేరళలోని టాక్సీ,ఆటో డ్రైవర్లకు కార్మెలైట్ సిస్టర్స్ ఆర్థికంగా, మానసికంగా,కుటుంబపరంగా అండగా నిలుస్తున్నారు.2016లో సిస్టర్ రోజ్ మారియా ప్రారంభించిన “సారథి హెల్ప్‌లైన్ ఫర్ డ్రైవర్స్” ద్వారా డ్రైవర్లను స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి,అనారోగ్యం, ప్రమాదాలు,ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు పరస్పరం సహాయం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మతభేదాలకు ఎలాంటి స్థానం లేకుండా క్రైస్తవులు, హిందువులు,ముస్లింలు కలిసి పనిచేస్తున్నారు.సభ్యులు క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేసి ఉమ్మడి నిధిని ఏర్పాటు చేసుకుంటారు;అవసరమైన సమయంలో ఆ నిధి నుంచి వడ్డీ లేని రుణాలు,ఇతర సహాయాన్ని అందిస్తారు. ఒక డ్రైవర్‌కు గుండె చికిత్స కోసం సాయం చేయడం నుంచి కుటుంబ సమస్యలు,మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు కౌన్సెలింగ్ అందించడం వరకు కన్యా స్త్రీలు తమ సేవలను విస్తరించారు.అంతేకాకుండా కుటుంబ సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు,పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ డ్రైవర్లను భాగస్వాములను చేస్తున్నారు. “మేము ఎవరి మతం లేదా రాజకీయాలను అడగం; డ్రైవర్లు, వారి కుటుంబాల సంక్షేమమే మా లక్ష్యం” అనే సిస్టర్ రోజ్ మారియా మాటలు ఈ సేవ యొక్క సారాన్ని తెలియజేస్తాయి.ఆర్థిక సహాయం అందించడమే కాకుండా కష్టాల్లో ఉన్నవారికి “మీరు ఒంటరివారు కాదు” అనే భరోసాను కల్పిస్తూ కార్మెలైట్ సిస్టర్స్ చేస్తున్న ఈ సేవ క్రైస్తవ సేవాస్ఫూర్తికి,మతసామరస్యానికి అందమైన ఉదాహరణగా నిలుస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా కార్మెలైట్ సిస్టర్స్ ను కతోలిక విశ్వాసులు ప్రశంసిస్తున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN