నిజమైన శాంతిని నిర్మించడానికి ఆయుధాలు అవసరం లేదు: పోప్

వాటికన్ వార్తా విభాగం

20 Aug 2026

ప్రపంచ సృష్టి సంరక్షణ కోసం ప్రార్థనా దినోత్సవం సందర్భంగా పోప్ లియో XIV ఇచ్చిన సందేశంలో,యుద్ధం వల్ల కలిగే విధ్వంసం యుద్ధభూమిని దాటి తరతరాల వరకు ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.సెప్టెంబర్ 1న జరుపుకునే ఈ దినోత్సవానికి “వారు తమ ఖడ్గాలను నాగటి కర్రలుగా, తమ ఈటెలను కొడవళ్లుగా మార్చుదురు” అనే యెషయా ప్రవచన వాక్యం ప్రధానాంశంగా ఉంది.సృష్టి మాత్రమే కాకుండా మానవ సంబంధాలు,మన హృదయాలు కూడా దేవుడు మనకు అప్పగించిన “పర్యావరణ వ్యవస్థలే” అని పోప్ పేర్కొన్నారు.యుద్ధం ప్రాణాలను బలిగొనడంతో పాటు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుందని, లక్షలాది మందిని తమ ఇళ్లను విడిచి వెళ్లేలా చేస్తుందని పోప్ అన్నారు. అంతేకాకుండా యుద్ధం గాలి, నీరు వంటి సహజ వనరులను కలుషితం చేసి, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తుంది; ఆహార భద్రతను దెబ్బతీసి పేదరికం, అసమానతలు, సామాజిక ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. ఈ విధంగా యుద్ధం మరియు పర్యావరణ విధ్వంసం ఒకదానికొకటి బలపరిచే ప్రమాదకరమైన చక్రంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN