జింబాబ్వే పడవ ప్రమాద మృతులకు పోప్ లియో సంతాపం

వాటికన్ వార్తా విభాగం

19 Aug 2026

జింబాబ్వేలో జరిగిన ఘోర పడవ ప్రమాదంపై పోప్ లియో XIV తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కరిబా సరస్సులో ఆగస్టు 11న జరిగిన ఈ ప్రమాదంలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో 18 మంది చిన్నారులు కూడా ఉన్నారు.ఈ విషాద ఘటనతో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు పోప్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతుల ఆత్మలను సర్వశక్తిమంతుడైన దేవుని కరుణకు అప్పగిస్తూ,వారి కుటుంబాలకు ఓదార్పు,ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. అలాగే ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులు,అత్యవసర సేవల సిబ్బందికి తన ప్రార్థనలను అందించారు.ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు దేవుని ప్రేమ,ఓదార్పు,మనోధైర్యం లభించాలని పోప్ లియో XIV ప్రార్థించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN