అందరు ఆయనకు సమానమే

Admin

18 Aug 2026

సామాన్య 20వ బుధవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 20:1-16
యేసు పరలోక రాజ్యము గురించి ఉపమానం ద్వారా వివరించిన సందర్భంలో వింతైన సత్యాన్ని తెలుసుకుంటున్నాము.పని అప్పగించినప్పుడు ఆ కార్యము చేయడానికి సాహసించాలి.బాధ్యత కలిగి కార్యము జరిగేలా చూడాలి. మనము అలా చేసినప్పుడు ఫలితాలు కొన్నిసార్లు ఆశించినదానికన్నా గొప్పగా వుంటాయి.కరుణగల దేవుడు అవధులు లేని దేవుని కరుణ. బిడ్డ కుంటివాడైనను, గుడ్డివాడైనను అందచందాలతో ఉన్నను తల్లికి బిడ్డే.ఈ విశాల సృష్టిలో ప్రతి మనిషి దేవుని ప్రతిరూపం. ఆయన మంచి చెడు తారతమ్యం లేకుండా సూర్యవేడిమి,వర్షమును ఇచ్చు దేవుడు తన కరుణను ఔదార్యాన్ని కూడా అందరికి సమానంగానే చూపుతారు. ఈనాటి ఉపమానం ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపుతుంది.శ్రీసభ అనే ద్రాక్షతోటలో సకల జాతులు భిన్న స్వభావాలు కలవారు ఉన్నారు. కాని అందరు ఆయనకు సమానమే.అంతటి కరుణగల వాడు మన దేవుడు. మరి ఆయన ప్రతి బింబాలైన నీవు నేను ఈ ఔదార్యాన్ని ఎంతవరకు మన జీవితాలలో ప్రతిబింబిస్తున్నాం? ఆలోచిద్దాం.., ఆచరిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN