దేవుని కృపకు హద్దులు లేవు - పోప్
జోసెఫ్ అవినాష్
17 Aug 2026
ఆగస్టు 16, 2026న కాస్టెల్ గాండోల్ఫోలో ఆదివారం ఏంజెలస్ ప్రార్థన సందర్భంగా పోప్ లియో XIV, కనానీయ స్త్రీ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ప్రసంగించారు.యేసు వద్దకు తన కుమార్తె స్వస్థత కోసం వచ్చిన ఆ విదేశీ స్త్రీ,తనకు అర్హత లేదని భావించినప్పటికీ విశ్వాసంతో ప్రభువును ఆశ్రయించింది.ఆమె విశ్వాసం ద్వారా దేవుని కృప ఏ ఒక్క వర్గానికో,సమూహానికో పరిమితం కాదని,ప్రతి మనిషికీ అందుబాటులో ఉందని పోప్ గుర్తుచేశారు.మనుషులు నిర్మించే సరిహద్దులు,వివక్షలు, భేదభావాలు దేవుని ప్రేమకు అడ్డుకావు.అందువల్ల క్రైస్తవ సమాజం కూడా ఎవరినీ వెలివేయకుండా,ప్రతి వ్యక్తి గౌరవాన్ని గుర్తించి,అందరినీ ఆహ్వానించే సమాజంగా ఉండాలని పోప్ పిలుపునిచ్చారు.ముఖ్యంగా బాధల్లో ఉన్నవారిని,అంచులకు నెట్టబడినవారిని ప్రేమతో స్వీకరించడం ద్వారా క్రీస్తు హృదయాన్ని ప్రపంచానికి చూపాలని ఆయన సూచించారు.
