మరియతల్లి మోక్షారోపణ: పరలోకానికి తెరచిన ద్వారం! - పోప్

జోసెఫ్ అవినాష్

17 Aug 2026

ఆగస్టు 15 మరియతల్లి మోక్షారోపణ మహోత్సవం సందర్భంగా పోప్ లియో XIV మాట్లాడుతూ,మరియతల్లి జీవితం మనిషి యొక్క నిజమైన అందం మరియు అంతిమ గమ్యాన్ని తెలియజేస్తుందని చెప్పారు.ప్రపంచం బాహ్య సౌందర్యం,యవ్వనం,రూపాన్ని గొప్పగా భావిస్తున్నప్పటికీ, నిజమైన అందం దేవుని ప్రేమతో పవిత్రమైన హృదయంలోనే ఉంటుందని ఆయన వివరించారు.ప్రేమ,వినయం, విశ్వాసంతో నిండిన మరియతల్లి జీవితం ఆమెను శరీరాత్మలతో పరలోక మహిమకు చేర్చిందని పేర్కొన్నారు.దేవుని కృప మన జీవితాలను కూడా మార్చి, పవిత్రత ద్వారా పరలోక జీవితం వైపు నడిపిస్తుందని పోప్ పిలుపునిచ్చారు.మరియతల్లి మోక్షారోపణ మనందరికీ ఆశ, విశ్వాసం మరియు దేవుని ప్రేమలో జీవించే జీవితానికి ఒక గొప్ప సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN