ప్రేమ-తప్పులను చేయనీయదు

జోసెఫ్ అవినాష్
16 Aug 2026
సామాన్య 20వ సోమవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 19:16-22
జీవితంలో ఒకటి పొందాలంటే మరొకటి తప్పకుండా కోల్పోవాలి.దేవుని పూర్ణ ఆత్మతో,మనసుతో,శక్తితో అనుసరించాలంటే దేవుడు మన నుండి తప్పకుండా మనం చేయగల త్యాగాన్ని కోరతాడు. అవి సంపదలు కావచ్చు, అధికారం కావచ్చు, వివాహజీవితం కావచ్చు. ఏదోఒక త్యాగం మాత్రం తప్పదు.అది చేయలిగితే తప్పకుండా మనం దేవుని ప్రేమను,ఆదరణను ప్రత్యక్షంగా చవిచూస్తాం.ప్రకృతిలో ఋతువులు,కాలాలు మానవుని మనుగడకు తోడ్పడుచున్నవి.అలాగే దిక్కులు:తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.అలాగే రోడ్డు ప్రక్కనున్న మైలురాయి కూడా మనం చేరవలసిన గమ్యం ఎటువైపు ఉంది,ఎంత దూరం ఉందో చూపిస్తుంది.నేటి మొదటి పఠనంలో మోషే ఆధ్యాత్మికంగా పవిత్రంగా జీవించమని అర్థిస్తున్నాడు. సాంఘిక న్యాయం దేవుని దీవెన ఇవి రెండు ఒకదానితో ఒకటి ముడిపడి వున్నాయి. తమకున్న సంపదను లేనివాళ్ళతో పంచుకోలేనట్లయితే దేవుని దీవెన ఉండదు.ధనమే దైవం అనుకోక జీవితం పొరుగువారి యెడల ప్రేమతో జీవించాలి. ఇటువంటి జీవితమే మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. దేవుని అనుసరించుదాం,మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. మన జీవితంలో పాపములకు స్వస్థి చెప్పుతూ క్రీస్తు మార్గంలో ముందుకు సాగాలి.ప్రేమించే వారు ఇతరులకు హాని చేయరు,ఇంకా ప్రేమను పంచుతారు. ప్రేమ-తప్పులను చేయనీయదు.
