యువతా! మేలుకో -జగతిని ఏలుకో

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
16 Aug 2026
నేను ఏమి చేయగలను
నేను బలహీనంగా ఉన్నానని
నాకు అంతగా తెలివితేటలు
లేవని
నాస్వరం గొప్ప స్వరం
కాదని
నేను చాలా అందగాలేనని
దిగులుపడి, కుమిలి
కుమిలి నశించిపోకు
ఓ యువతా!
నీ పేరును తన అరచేతి
రాసుకొని నిన్ను సకల జాతులకు
ఖ్యాతిగా నీతిగా
రాబోవు తరాలను ఏలే
మహా ఘన ఏలికగా
చేయబోతున్న నిజ స్నేహితుడు,
నీ ఆత్మ రక్షకుడు ప్రభుయేసుని
నమ్ము ధన్యజీవి కమ్ము.
