ఆదివారం దివ్యబలిపూజ విశ్వాసులను తీర్చిదిద్దాలి: పోప్

జోసెఫ్ అవినాష్

14 Aug 2026

ఆదివారం జరిగే దివ్యబలిపూజ కేవలం ఒక ఆరాధనా కార్యక్రమంగా కాకుండా,విశ్వాసుల జీవితాలను క్రీస్తువైపు మరింత లోతుగా నడిపించే అనుభవంగా ఉండాలని పోప్ లియో XIV అన్నారు.ఒరెగాన్‌లో జరుగుతున్న పవిత్ర కతోలిక దైవార్చన పై జరుగుతున్న సదస్సుకు పంపిన సందేశంలో, దైవార్చన పై అవగాహన కొద్దిమంది నిపుణులకే పరిమితం కాకుండా దేవుని ప్రజలందరిలో విశ్వాసపూర్వకమైన జీవన విధానంగా మారాలని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఆదివారం జరిగే దివ్యబలి ఇందుకు ప్రత్యేకమైన అవకాశమని తెలిపారు. పవిత్ర రహస్యాలను గౌరవప్రదంగా జరుపుకోవాలంటే శ్రీసభ నిర్దేశించిన పూజా క్రమాలను నిబద్ధతతో పాటించాలని, ముఖ్యంగా గురువులు వాటిని గౌరవించాలని కోరారు. అయితే ఇది కేవలం నియమాలను పాటించడం మాత్రమే కాకుండా, దేవుని పట్ల వినయం,విశ్వాసం,శ్రీసభ ఐక్యత పట్ల నిబద్ధతతో కూడి ఉండాలని పోప్ స్పష్టం చేశారు.ఈ సమావేశాన్ని జ్ఞాన సింహాసనమైన మరియమాతకు అప్పగిస్తూ,పవిత్ర ఆరాధనా జీవితం పట్ల సరైన ఆధ్యాత్మిక వివేచనను ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN