విదేశీ విరాళాల నిబంధనలపై కతోలికుల ఆందోళన

జోసెఫ్ అవినాష్
13 Aug 2026
విదేశాల నుంచి వచ్చే విరాళాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలు మరింత కఠినంగా మారే అవకాశం ఉండటంపై భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ప్రతిపాదిత మార్పులను పరిశీలించేందుకు ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి పంపిన నేపథ్యంలో,సంబంధిత వర్గాలతో మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని సమాఖ్య పేర్కొంది.విదేశీ విరాళాల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపింది.ప్రభుత్వం చర్చలకు అవకాశం కల్పిస్తే తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేసి,ప్రజాసేవా కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా నిబంధనలను రూపొందించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాఖ్య వెల్లడించింది.
