క్షమాపణ అనేది ఒక వంతెన లాంటిది
.jpg)
Admin
13 Aug 2026
సామాన్య 19వ గురువారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 18:21-19:1
ఈనాటి పఠనాలు మనం క్షమించాలి అని మన్నించి మరచిపోవాలి అని మనకు బోధిస్తున్నాయి.క్షమాపణ అనేది ఒక వంతెన లాంటిది.. మనం పరలోకానికి చేరే వంతెన.కొంతమంది అంటూ ఉంటారు. ఇక నేను క్షమించలేను ఒకసారి క్షమించాను,రెండుసార్లు క్షమించాను,మూడు, నాలుగు.., 10 సార్లు కూడా క్షమించాను.ఇక క్షమించడం నావల్ల కాదు అని అంటూ ఉంటారు.అలా ఎవరైతే అంటారో అలాంటి వారు, వారు నడుస్తూ ఉన్నటువంటి ఆ పరలోక వంతెనను వాని స్వహస్తాలతో కూర్చుకొని వారు నరకము అను సముద్రములో పడిపోయేవారుగా ఉన్నారు. కాబట్టి మనం క్షమించే వారలంగా ఉండాలి. ఎదుటివారి పాపములు క్షమించకపోతే దేవుడు నీ పాపములను కూడా క్షమించడని తద్వారా నేను నరకానికి వెళతావని నీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 28:2-4 వచనాలలో మనం తెలుసుకుంటున్నాము. ఈనాటి సువార్తా పఠనములో పేతురు ప్రశ్నకు ప్రభు చెబుతూ ఉన్నాడు? కాదు ఏడు డెబ్బదిసార్లు నేను క్షమించాలి అని, అంటే 490 సార్లు 7-70-490. సార్లు మాత్రమే క్షమించాలి అని అర్ధం కాదు. ఎన్నిసార్లైన క్షమించాలి అని అర్ధం.జీవిత కాలమంతా క్షమించాలి అని అర్ధం.పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము యోసేపు తన సోదరులను క్షమించాడు, ఏసావు యాకోబును క్షమించాడు, యాకోబు తన మామ లాబానును క్షమించాడు, దావీదు సౌలు రాజును క్షమించాడు.స్తెఫాను తనను రాళ్ళతో కొట్టి చంపేవారిని క్షమించమని దేవుడికి మొరపెట్టాడు.యేసుప్రభువు సిలువ మీద తనను అమానుషంగా సిలువు వేసి చంపిన వారిని క్షమించాడు. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని గురువు పూజ చివరి భాగములో ఆశీర్వచనాలతో ముగిస్తాడు.అంటే క్షమాపణ ఉన్నచోట ప్రేమ ఉంటుంది అని అర్ధం.క్షమించటం అనేది చాలా గొప్ప గుణం,క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనమే క్షమాపణ.
