వేలంకన్ని మహోత్సవాలకు ప్రత్యేక రైళ్లు

జోసెఫ్ అవినాష్
12 Aug 2026
సెప్టెంబర్ నెలలో జరగనున్న వెళంగిని మాత మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు రైళ్లలో రద్దీని నివారించేందుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.బాంద్రా టెర్మినస్- వేలంకన్ని మధ్య ఒక ప్రత్యేక రైలు నడుపబడుతోంది.రైలు నంబరు 09059.ఈ ప్రత్యేక రైలు ఆగస్టు 27 తేదీ,సెప్టెంబర్1వ తేదీలలో రాత్రి 9.30 గంటలకు బాంద్రా టెర్మినస్ నుండి బయలుదేరి,3వ రోజు ఉదయం 10 గంటలకు వేలంకన్ని చేరుకుంటుంది.రైలు నంబరు 09060,ఈ నెల 30వ తేదీ,సెప్టెంబర్ 4వ తేదీలలో అర్ధరాత్రి 12:45 గంటలకు వెలంగిని నుండి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాంద్రా టెర్మినస్ చేరుకుంటుంది. రైలు నంబరు 09061 కూడా వాల్గట్ - వేలంకన్ని మధ్య ఈ రైలు సెప్టెంబర్ 6వ తేదీన రాత్రి 7.40 గంటలకు వాల్గడ్ నుండి బయలుదేరి,3వ రోజు ఉదయం 10:5 గంటలకు వేలంకన్ని చేరుకుంటుంది. రైలు, నంబరు 09062,సెప్టెంబర్ 8వ తేదీన మధ్యాహ్నం 3.10 గంటలకు వేలంకన్ని నుండి బయలుదేరి, 3వ రోజు ఉదయం 5.30 గంటలకు దహను రోడ్ చేరుకుంటుంది.ఈ రైలుకు బుకింగ్ మంగళవారం(11వ తేదీ) ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.
