సంఘ ప్రార్థన చాలా విలువైనది

జోసెఫ్ అవినాష్
11 Aug 2026
సామాన్య 19వ బుధవారం
సువిశేష ధ్యానం -:
మత్తయి 18:15-20
భోజనంలేని వారికి భోజనం పెట్టుట సులభం,అలాగే డబ్బులేని వారికి డబ్బును ఇవ్వవచ్చును.కాని శత్రువుగా భావించే వ్యక్తికి క్షమను పంచుట చాలా కష్టం.ఈనాటి సువార్తలో క్రీస్తు క్షమను గురించి తెలియజేస్తూ 3 విధానాలను అవలంభించమని చెప్పుచున్నారు.ఒంటరిగా ప్రార్థన చేస్తే అది వ్యక్తిగత ప్రార్థన,కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తే అది కుటుంబ ప్రార్థన.కొన్ని కుటుంబాలన్నీ కలిసి ప్రార్థన చేస్తే అది సంఘ ప్రార్థన అవుతుంది.సంఘ ప్రార్థన చాలా విలువైనది. సంఘము వృద్ధిచెందుతుంది, ఐక్యత పంచుతుంది. సమస్యలు తొలుగుతాయి. ఎందుకనగా ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ ప్రభువు ఉండి వారికి వేదన తొలగిస్తారు (మత్తయి 18:20). అని ప్రభువు ఈనాటి సువార్తలో పలుకుచున్నారు.
యదార్ధవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము (సామె. 15:4). విశ్వాసముతో చేసిన ప్రార్ధన ఆ రోగిని స్వస్థపరచును (యాకోబు 5:15).
