బ్లాక్ డే నిర్వహించిన క్రైస్తవ దళిత ప్రజా సంఘాలు

Admin
11 Aug 2026
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి 1950 రాష్ట్రపతి ఉత్తర వలలో పేరా త్రిను రద్దు చేయాలి 12 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాజ్యాంగ విరుద్ధమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగు రీజియన్ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇండియా వారి పిలుపుమేరకు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ 1950లో ఆగస్టు 10న భారత రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వులు పేరా నెంబర్ 3 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని ఆ ప్రజాస్వామికమైనదని అన్నారు ఎవరైనా స్వీకరించవచ్చు అనే భారత రాజ్యాంగం చెబుతూ ఉంటే ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ముస్లిం మతానికి వెళ్లిన ఎస్సీ హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ 15 ప్రకారము మతం, కులం ప్రాంతం లింగం ఆధారంగా వివక్షత చూపరాదని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు చట్టాలు సమాన రక్షణ అందరికీ కల్పించాలని ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పిస్తున్న ఈ ప్రాథమిక హక్కులకు ఈ ఉత్తరము తీవ్ర విఘాతాన్ని కలిగించిందని తెలిపారు. మతం మారినంత మాత్రాన కులము మారదని కుల వివక్షత అంటరానితనం వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉందని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ చిదంబరం కమిషన్ కాకా కమిషన్ నివేదికలు ఇచ్చిన నేటికీ దళిత క్రైస్తవులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. అంతేకాకుండా గత 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఉన్న రెడ్డి పిటిషన్లు విచారణకు నోచుకోకపోవడం తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న రెడ్ పిటిషన్లను పరిష్కరించేందుకు తగిన చర్యలు చూపించాలని కోరారు .విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్ ప్రతినిధి విజయనగరం డీనరీ మత గురువు ఫాదర్ అంతయ్య మాట్లాడుతూ భారతదేశంలో 12 రాష్ట్రాల్లో తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు రద్దు చేయాలని అందుకొనుగుణంగా కేంద్రానికి సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి వినతి వినతి పత్రాలు దేశమంతా ఇస్తున్నట్లు తెలియజేశారు.
ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్వీనర్ పాస్టర్ ప్రమాదం మాట్లాడుతూ మతం మారిన కుల వ్యవస్థ కుల వ్యవక్షత కొనసాగుతున్నది అనేది సామాజిక వాస్తవం దళిత క్రైస్తవులపై అనేక రకాలైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 2023లో 734 సంఘటనలు 2024లో 834 సంఘటనలు 2025లో దాదాపు 900 సంఘటనలు నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలియజేస్తున్నది. ప్రతి ఏటా పెరుగుతున్న దాడులు పట్ల క్రైస్తవ మైనారిటీ సమాజం ఆందోళన చెందుతుందన్నారు. కార్యక్రమంలో పీపుల్స్ యాక్షన్ ఫోరం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాదర్ సింహరాయులు, వివిధ క్రైస్తవ సంఘ మత పెద్దలు యమ్మల రవి, కె థామస్, ఉర్లపు చిరంజీవి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జిల్లా అధ్యక్షులు లండ రాజబాబు, దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే సిహెచ్ బంగారు రాజు, జిల్లా కార్యదర్శి ఎం పి రాజు సివిఎంసి జిల్లా కన్వీనర్ కె జగదీష్ , సోషల్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, అంకురం సంఘం ఫోరం రమణ, రమణ నిరీక్షణ ప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు పి సత్యవతి, సియాధుల పార్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రధానమంత్రి కి పంపించే వినత పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ క్రైస్తవ సంఘాల, దళిత ఆదివాసి సంఘాల, మానవ హక్కు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
