'బ్లాక్ డే': దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్!

జోసెఫ్ అవినాష్
11 Aug 2026
దళిత క్రైస్తవులకు sc హోదా ఇవ్వాలని నెల్లూరు కతోలిక పీఠాధిపతులు మహా ఘన.ఎం డి ప్రకాశం తండ్రి గారి ఆధ్వర్యంలో ఆగస్టు 10న జరిగిన క్రైస్తవుల శాంతియుత ర్యాలీ ఘనంగా జరిగింది. ఆయన పిలుపుమేరకు నెల్లూరు జిల్లాలోని వివిధ క్రైస్తవ శాఖలకు చెందిన దైవజనులు ,క్రైస్తవ నాయకులు,సంఘ కాపరులు పాల్గొన్నారు.
స్థానిక వి ఆర్ సి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ఆనాటి రాష్ట్రపతి 1950 పేరా 3 ని తీసుకొచ్చి దళితులు చర్చ్ కి వెళితే కులం రద్దు అవుతుందని తీసుకొచ్చిన ఆర్డర్ దళితుల మనోభావాలను దెబ్బతేసే విధంగా ఉన్నాయని చర్చికి వెళ్లినంత మాత్రం ఆర్ధిక స్టేటస్ ఏమి మారదని అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందని 1950 పేరా 3ని రద్దుచేసి దళిత క్రైస్తవులకు ఎస్సే హోదా ఇవ్వాలని ఈ విషయంపై రాష్ట్రపతికి, ప్రధానమంత్రి కి తెలియజేయాలని కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు పీఠానికి చెందిన కతోలిక గురువులు ఫాదర్ ఇన్నయ్య, హృదయరాజ్, విక్టర్,మాథ్యూ, రమేష్, జోసెఫ్ కుమార్, క్రైస్తవ నాయకులు కలివేల ఇలుషా కుమార్, ఊరందరు సురేంద్రబాబు, ఏం బర్నాబాస్, కె ఎస్ రాజు,రాజశేఖర్,రమేష్,కిషోర్, సునీల్, ఎనోష్, సునీల్ గవాస్కర్,విజయ్ కుమార్, జాన్షన్, జోసెఫ్, స్వరాజ్, యాకోబు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
