సూడాన్, ఉక్రెయిన్‌లో హింసకు చరమగీతం పాడాలి: పోప్

జోసెఫ్ అవినాష్
10 Aug 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV సూడాన్,ఉక్రెయిన్‌లలో కొనసాగుతున్న హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ,హింసా చక్రానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.సూడాన్‌లో ముఖ్యంగా ఎల్-ఒబైద్ నగర ప్రజలకు మానవతా సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని,తక్షణ కాల్పుల విరమణకు కృషి చేయాలని కోరారు.ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అమాయక ప్రజలు,చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.పౌరుల రక్షణకు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలని,యుద్ధానికి బదులుగా సంభాషణ,దౌత్య మార్గాలను ఎంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.యుద్ధం మరింత యుద్ధాన్నే పుట్టిస్తుందని హెచ్చరిస్తూ,శాంతి కోసం ప్రపంచ నాయకులు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని పోప్ పిలుపునిచ్చారు.
