వాటికన్‌లో భారతీయ కన్యా స్త్రీకి కీలక బాధ్యత

జోసెఫ్ అవినాష్

08 Aug 2026

విశ్వ కాపరి పోప్ లియో XIV భారతదేశానికి చెందిన సిస్టర్ నిర్మలిని వాటికన్‌లోని జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలోని సమర్పణ జీవితం,అపోస్తలిక జీవన సంస్థల విభాగానికి సలహాదారుగా నియమించారు.ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ బాధ్యతలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్యా స్త్రీల సభలు, సమర్పణ జీవితం గురించి విభాగానికి తన అనుభవాన్ని, మార్గదర్శక సూచనలను అందించనున్నారు. భారతీయ కతోలిక కన్యా స్త్రీకి వాటికన్ స్థాయిలో లభించిన ఈ బాధ్యత విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. జగద్గురువుని పరిపాలన యంత్రాంగములో పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా సమానమైన గౌరవ హోదాని అందిస్తున్నందుకు పోప్ గారిని సామాజిక మాధ్యమాల వేదికగా కతోలికులు ప్రశంసిస్తున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN