నేటి పునీతులు:పునీత దోమినిక్ గుజ్మన్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
08 Aug 2026
పునీత దోమినిక్ గుజ్మన్ గారు స్పెయిన్ దేశంలో కాసిల్ పట్నంలోని కలరుయెగ గ్రామంలో క్రీ||శ|| 1170లో జన్మించారు. తండ్రి ఫెలిక్స్ గుజ్మన్. తల్లి పునీత జోన్ ఆఫ్ ఆజ. వీరు గురువుగా పనిచేస్తున్న తమ మేనమామగారి వద్ద ఉండి విద్యాబుద్ధులు గడించారు. తమ 14వ ఏట పలన్షియ విశ్వవిద్యాలయంలో చేరి ఉన్నత విద్య అభ్యసించారు. పట్టుదలతో శ్రద్ధతో తత్వశాస్త్రం, వేదాంత విద్య పదేళ్లు చదివి పండితుడయ్యారు. సాహిత్యం బాగా వచ్చు. వారు పరిశుద్ధత, దాతృత్వంకు ప్రాధాన్యతనిచ్చేవారు. అందుకే కాబోలు తమ విలువైన పుస్తకాలు వస్తువులు తెగనమ్మి ఆ రాబడితో పేదలు అనాధలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురువుకావాలని కోరికతో తత్ సంబంధిత శిక్షణ పొంది, ఒస్మా నగర బిషప్ డిగోడి అజెవెదొగారి హస్తాలు మీదుగా క్రీ||శ|| 1199లో గురుపట్టాభి షిక్తులయ్యారు. కఠిన కట్టుబాట్లతో స్థానికంగా నెలకొని ఉన్న మునీత బెనడి క్జునభ కు నువీ రియరుగా నియమితులయ్యారు.
కాసిల్ రాజ్యరాజు తన కుమారుని పెండ్లి డెన్మార్కులో జరిపించడానికి నిశ్చయిం చాడు. కాన స్థానిక బిషప్ డిగో డి అజెవెదొగార్ని ఆహ్వానించాడు. బిషప్ గారితోపాటు తోడుగా ఫాదర్ దోమిని గారు సైతం క్రీ||శ|| 1204లో బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో వారు ఫ్రాన్సుదేశంలోని లంగు యెడోక్ పట్నం చేరుకున్నారు. అక్కడ క్రైస్తవ మతంకు విరుద్దంగా చెప్పబడుతున్న దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతాలపట్ల బహుగా దుఃఖించారు. అల్బిజెన్షియన్ మత శాఖవారు ప్రజల్ని పెడత్రోవ పట్టిస్తున్నారు. వారు ఏసు ప్రభువు మేరీమాత గర్భాన జన్మించలేదని బోధించారు. శ్రీసభ పేరట ఆస్తులు కలిగి ఉండటాన్నివారు ఆక్షేపించారు. గురువులను విమర్శిస్తుండేవారు. ఆ రోజు రాత్రి దోమినిక్ గురువర్యులు అట్టి అపమార్గం పట్టిన ఒక ప్రముఖ వ్యక్తితో సంభాషించారు. తెల్లవారిందాకా చర్చించిన మీదట అతడు కతోలిక సిద్ధాంతాల్ని పూర్తిగా విశ్వసించాడు.
ఈ ఫలవంతమైన సమావేశ స్ఫూర్తితో ఫాదర్ దోమినిక్ గారు అక్కడే తన వేద ప్రచారాన్ని కొనసాగించారు. క్రీస్తు నిజమైన దేవుడు నిజమైన మనిషి అని సువార్తమానాన్ని గట్టిగా విన్పించారు. అల్బిజెన్షియనులతో పోరాటంకు దిగారు. తప్పుడు బోధలతో తిరుగాడుతున్న ప్రముఖ బోధకుల సమూహాన్ని పట్టుకొని వారి తప్పుడు అభిప్రాయాల్ని ఉతికి ఎండగట్టారు. వారిలో హృదయ పరివర్తన తేగలిగారు. ఈ విధంగా పది సంవత్సరాలు లాంగ్వెడోక్ పట్నంలోనే తమ దైవ వాక్యాన్ని విస్తృత పరిచారు. క్రీ||శ|| 1206లో ప్రవుల్లెనగరంలో ఒక కాన్వెంటును ప్రారంభించారు.
పునీత దోమినిక్ స్వాములవారు క్రీ||శ|| 1214లో తౌలస్ పట్నం వెళ్లి తన సేవ నిమిత్తం ఎంతో ఆర్థిక సహాయాన్ని పొందకలిగారు. క్రీ|శ|| 1215లో 4వ లాటరన్ కౌన్సిల్ సమావేశాల్లో ఫలవంతంగా పాల్గొన్నారు. క్రీ||శ|| 1216లో తన పదహారు మంది అనుచరులతో ప్రవుల్లె కాన్వెంటుకు విచ్చేశారు. తనదైన శైలిలో కట్టుబాట్లు, నియమావళి రచించి దోమినిక్ మత బోధకులసభను స్థాపించారు. వీరిసభలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. పవిత్రత, నిరాడంబరత ప్రధాన వ్రతాలుగా స్వీకరించారు. క్రీస్తు సత్యవేదాన్ని చాటడం, కతోలిక వేదంకు ఊతంగా ప్రబోధించడం ప్రారంభించారు. క్రీ.శ|| 1216లో 3వ హొనోరియస్ పోపుగారు దోమినిక్ సభకు
ఆమోద ముద్రవేశారు. ఈ సభ కౌలస్ పట్టణం కేంద్ర స్థానంగా తమ సేవలు కొనసాగించారు. యూరవు ఖండంలో క్రైస్తవ మతాన్ని అల్బిజెన్సియనులు భ్రష్టు పట్టిస్తున్న తరుణంలో శ్రీసభకు కుడి భుజంగా 13వ శతాబ్దంలో దోమినిక్ సభ ప్రధాన పాత్ర పోషించింది. అపోస్తుల తరహాలో సువార్తా ప్రచారం చేశారు. పునీత దోమినిక్ తన శిష్యుల్ని యూరప్ అంతట పంపిస్తూ "మనం వాక్యవిత్తనాల్ని వెదజల్లాలి, కూడబెట్టుకోకూడదు" అని చివరి సందేశంగా చెప్తుండేవారు. వారి సభ స్పెయిను, ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఇటలీ మున్నగుదేశాల్లో విస్తరించింది. వారి సభకు పునీత దోమినిక్ గారే సుపీరియర్ జనరల్ గా క్రీ||శ|| 1220లో 3వ హొనోరియస్ పోపుగారు నియమించారు. వారి సభ తొలి సర్వసభ్య సమావేశం అదే సం||ములో బొలో (గ్)నా నగరంలో నిర్వహింపబడింది. వారు ఆ నగరంలోనే క్రీ||శ|| 1221 ఆగష్టు 6వ తేదీన పరలోక ప్రాప్తినొందారు. హంగరీదేశంలో సువార్తా ప్రచారం చేసేటప్పుడు తీవ్ర వ్యాధికి గురై తిరిగి తమ ప్రధాన కార్యాలయం చేరుకొని పరమ పదించారు. అప్పుడు వారికి 51 సంవత్సరాలు.
పునీత దోమినిక్ గారి సభ వారు ఇంగ్లాడులోని
ఆక్స్ఫర్డ్ లో అనేక విద్యా లయాలు స్థాపించారు. కాలక్రమములో అవి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధినొందాయి. అవిశ్రాంత ప్రయాణంతో సువార్త ప్రచారంచేస్తూ పునీత దోమినిక్ గారు లక్షమందికి పైగా అవిశ్వాసుల మనస్సుమార్చారు. జపమాల భక్తిని విస్తృతపరచారు. అనేక అద్భుతాలు చేశారు. చనిపోయిన ఒక వ్యక్తిని సజీవంతో కూడ లేపారు. సత్యంనందుప్రేమ, కర్తవ్య నిర్వహణయందు పట్టుదల పాపాత్ముల ఆత్మల రక్షణయందు కనికర కృషి, దృష్టి వారిని ఉన్నత శిఖరాలపై ఉంచింది. సంతోషంతోనిండినవారి హృదయం అప్పుడప్పుడు ఒక పాటగా దేవుని స్తుతిస్తుండేది. ఇట్టి పుణ్యాత్మునికి క్రీ||శ|| 1234లో 9వ గ్రెగోరి పోపు గారిచే పునీత పట్టా ఇవ్వబడింది. ఖగోళశాస్త్రజ్ఞుల పాలక పునీతులుగా ఏర్పరుపబడ్డారు. దోమినిక్ అనగా ప్రభువుకు చెందిన అని అర్థం.
