ప్రార్థన మరిచిన కుటుంబాలకు పోప్ హెచ్చరిక

జోసెఫ్ అవినాష్

06 Aug 2026

కుటుంబాల్లో కలిసి ప్రార్థించే అలవాటు తగ్గిపోవడం ఆందోళనకరమని బుధవారం జరిగిన జనరల్ ఆడియన్స్ లో పోప్ లియో XIV అన్నారు.ప్రార్థన అనేది కేవలం ఒక ఆచారం కాదు,దేవునితో జీవమయమైన బంధాన్ని పెంపొందించే మార్గమని చెప్పారు.కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థించినప్పుడు ప్రేమ,ఐక్యత,విశ్వాసం బలపడతాయని, కానీ ప్రార్థనకు దూరమైతే విశ్వాస జీవితం క్రమంగా బలహీనపడుతుందని హెచ్చరించారు.ప్రతి కుటుంబం మళ్లీ ప్రతిరోజూ కలిసి ప్రార్థించే సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని పోప్ విశ్వాసులకు పిలుపునిచ్చారు.ముఖ్యంగా అనేక క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థనను నేర్పించే సంప్రదాయం కనుమరుగవుతోందని అన్నారు.ప్రార్థనను కేవలం మానసిక ప్రశాంతత కోసం చేసే ఒక పద్ధతిగా కాకుండా,దేవునితో జీవమయమైన సంబంధంగా తిరిగి గుర్తించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN