"ఇతరుల బాధను వినండి... వారి గాయాలను తాకండి" – యువతకు పోప్ పిలుపు
జోసెఫ్ అవినాష్
06 Aug 2026
2026 ఆగస్టు 6న, ఇటలీలోని అస్సీసిలో జరిగిన యువజన సమావేశంలో పాల్గొన్న పోప్ లియో XIV మాట్లాడుతూ, బాధపడుతున్న వారిని కేవలం చూసి జాలిపడడం సరిపోదని, వారి వేదనను వినే హృదయం,వారితో కలిసి నడిచే మనసు అవసరమని యువతకు పిలుపునిచ్చారు.దేవుని వాక్యాన్ని జీవితానికి మార్గదర్శకంగా స్వీకరించి,భయం లేదా స్వార్థానికి లొంగకుండా ప్రేమ,కరుణ,సేవతో ప్రపంచంలో ఆశకు సాక్షులుగా నిలవాలని ఆయన ప్రోత్సహించారు.పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ చూపిన మార్గంలో నడుస్తూ,మానవ బాధను ఆలకించే హృదయాలే సమాజాన్ని నిజంగా మార్చగలవని పోప్ గుర్తు చేశారు.
