ఆగస్ట్ 5 - దేవమాతకు అర్పింపబడిన పునీత మేరి మేజర్ దేవాలయం

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

05 Aug 2026

దైవార్చన క్యాలెండరు సవరింపబడకముందే ఈ రోజున నుండి దేవమాత పండుగ కొనియాడబడేది. ఇది జరుపబడటానికి ఒక గత చరిత్ర ఉంది. నాలుగవ శతాబ్దంలో రోమునగరంలో జాన్ అనబడే ఒక క్రైస్తవ భక్తుడు ఉండేవారు. ఆయనకు దేవమాతమ్మతల్లి దర్శనమై తాను చూపించిన చోట తన గౌరవార్థం ఒక బృహద్దేవాలయం నిర్మంప చేయబడాలని కోరారు. ఆ స్థల సూచనగా మండువేసవిలో రోము నగరంలో ఒక ఖాళీ స్థలంలో, అద్భుతంగా విపరీతమైన మంచు కురిసింది. ఆ స్థలం రోమునగరంలోని 'ఎస్ క్విలిన్' కొండ అంటారు.

జాన్ అను భక్తుడు ఆ మంచు కురిసిన ప్రదేశములో ఎన్ క్విలిస్ కొండ పై దేవమాతకు ఇష్టమైన దైవారాధనా మందిరం నిర్మంపబడటానికి క్రీ||శ|| 355లో శ్రీకారం చుట్టారు. లిబేరియస్ పోపుగారి పాలనలో ఈ దేవళం నిర్మంపబడటాన దానికి 'లిబేరియన్ బసిలిక అని పిలుస్తుండేవారు.

దాదాపు 90 ఏండ్లకు అనగా క్రీ||శ|| 431లో గ్రీసుదేశంలోని ఎఫేసు నగరంలో సకల, కెసవ మతాధిపతుల (సినడ్) సమావేశాలు జరిగాయి. ఆ సభలో కన్యమరియాంబ 'దేవునితల్లి'యని నిర్ద్వంద్వంగా వెల్లడింపబడింది. ఆ సందర్భంగా ఆవాటి 3వ సిక్స్ట-తు జగద్గురువులు 'లిబేరియన్ బసిలికా'ను మార్పులు చేర్పులతో ఇంకా విశాలంగా పునఃరుద్దరించి 'పవిత్ర కన్యమేరి దేవాలయం'గా అంకితంగావించారు.

7వ శతాబ్దంలో బెత్లహేములో క్రీస్తు ప్రభువు బాలుడుగా జన్మించిన చోటగల అవశేషాల్ని కొన్ని తెచ్చి ఈ పవిత్ర దేవాలయంలో భద్రపరచారు. అందువల్ల ఈ దేవాలయాన్ని 'పునీత మేరి మన్జెర్' అని పిల్చేవారు. ప్రపంచంలో పెద దేవాలయంగా ఇది పేరెన్నికగన్నది. దీనినే ఇప్పుడు 'పునీత మేరి మేజర్ (శాంతా మరియ మజ్జియోరె) దేవాలయంగా పిలువబడుచున్నది. ఈ గుడి గోపురం మీద నుండి పూర్వంలో ఇదే రోజున సుమధుర పరిమళాలు వెదజల్లుతూ మల్లె, రోజాపూల రెమ్మలు జల్లులా మెల్లగా కురిశాయి.

కనుక ఈ పండుగ అప్పటినుండి ఇప్పటి వరకు ఇదే రోజున మరియమాత గౌరవార్థం కొనయాడబడుతూనే ఉంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN